కోహ్లీ, రోహిత్ మాత్రమే కాదు.. ఆ ప్లేయర్లతోనూ గంభీర్‌కు గ్యాప్!
ABN , Publish Date - Aug 26 , 2026 | 09:39 AM
భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్‌గా గౌతమ్ గంభీర్ ప్రయాణం ఎవరినైనా ఆశ్చర్యపరిచేలా సాగుతోంది. ఈ నేపథ్యంలో మాజీ క్రికెటర్ వసీం జాఫర్.. గంభీర్ కోచింగ్ శైలిపై తన అభిప్రాయాలను పంచుకున్నాడు.
స్పోర్ట్స్ డెస్క్: భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్‌గా గౌతమ్ గంభీర్ ప్రయాణం ఎవరినైనా ఆశ్చర్యపరిచేలా సాగుతోంది. ఒకవైపు అద్భుత విజయాలతో ఐసీసీ ట్రోఫీలు అందిస్తే, మరో వైపు ఎదురైన ఘోర పరాజయాలు అతడి కెరీర్‌పై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. గంభీర్ హయాంలో టీమిండియా రెండు ఐసీసీ ట్రోఫీలను (2025 ఛాంపియన్స్ ట్రోఫీ, 2026 టీ20 ప్రపంచకప్) కైవసం చేసుకుంది. అయితే, స్వదేశంలో న్యూజిలాండ్, సౌతాఫ్రికా చేతిలో సిరీస్‌లలో ఎదురైన వైఫల్యాలు కోచ్‌గా అతడిపై తీవ్ర విమర్శలకు తావిచ్చింది.
ఈ నేపథ్యంలో మాజీ క్రికెటర్ వసీం జాఫర్.. గంభీర్ కోచింగ్ శైలిపై తన అభిప్రాయాలను పంచుకున్నాడు. వైట్ బాల్ క్రికెట్‌లో గంభీర్ అద్భుతమైన విజయాలు సాధించాడని, ఐసీసీ ట్రోఫీలు నిదర్శనమని కొనియాడాడు. అయితే, జట్టులో కొందరి పట్ల వ్యవహరించిన తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. ముఖ్యంగా టీ20 ప్రపంచకప్ గెలిచిన తర్వాత సూర్యకుమార్ వంటి కీలక ఆటగాడిని పక్కన పెట్టడం, పేసర్ మహమ్మద్ షమీ వంటిఆటగాళ్లకు మరిన్ని అవకాశాలు ఇవ్వాల్సిందని అభిప్రాయపడ్డాడు. ఈ ప్లేయర్ల విషయంలో గంభీర్ తీరుపై కొద్దిగా అసంతృప్తి వ్యక్తమైనా, వైట్-బాల్ క్రికెట్‌లో మాత్రం అతడిని తప్పుపట్టలేమని జాపర్ స్పష్టం చేశాడు.
మరోవైపు, రెడ్-బాల్ (టెస్టు) క్రికెట్‌పై మాత్రం జాఫర్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాడు. స్వదేశంలో న్యూజిలాండ్, సౌతాఫ్రికా జట్ల చేతిలో ఘోర ఓటములు గంభీర్ కెరీర్‌కు పెద్ద మచ్చగా మిగిలిపోతుందన్నాడు. భారత్‌కు వచ్చి సిరీస్ సిరీస్ గెలవడమనేది విదేశీ జట్లకు అతిగొప్ప విజయం, అలాంటిది స్వగడ్డపై భారత్ వరుసగా ఇలా ఓడిపోవడం ఊహించని పరిణామమని పేర్కొన్నాడు. ఈ రెండు సిరీస్‌లు కనుక గెలిచి ఉంటే.. టీమిండియా డబ్ల్యూటీసీ (WTC) పట్టికలో అగ్రస్థానంలో ఉండేదని గుర్తుచేశాడు.
ఇవి కూడా చదవండి:
జడేజా చెత్త రికార్డు.. 22లో 18 విఫలం!
ఫిట్‌గా ఉన్నారు.. క్రికెట్‌లోకి రీఎంట్రీ ఇస్తున్నారా?: సనత్‌తో స్కై