Share News

జడేజా చెత్త రికార్డు.. 22లో 18 విఫలం!

ABN , Publish Date - Aug 26 , 2026 | 07:31 AM

టీమిండియా స్టార్ ఆల్‌రౌండ‌ర్ ర‌వీంద్ర జ‌డేజాకు టెస్టు ఫార్మాట్‌లో ఓ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. అది కూడా డీఆర్ఎస్ విషయంలోనే కావడం గమనార్హం.

జడేజా చెత్త రికార్డు.. 22లో 18 విఫలం!
Ravindra Jadeja DRS

స్పోర్ట్స్ డెస్క్: టీమిండియా స్టార్ ఆల్‌రౌండ‌ర్ ర‌వీంద్ర జ‌డేజాకు టెస్టు ఫార్మాట్‌లో మంచి రికార్డు ఉంది. భారత్ సాధించిన ఎన్నో విజ‌యాల్లో జడ్డూ భాగ‌మయ్యాడు. తనదైన బౌలింగ్‌తో ఎల్బీడబ్ల్యూ రూపంలో బ్యాటర్లను దొరకబుచ్చుకునే వాడు. కానీ ఇప్పుడు అదే ఎల్బీడ‌బ్ల్యూల‌కు సంబంధించి డీఆర్ఎస్ తీసుకునే విష‌యంలో జడేజా చెత్త రికార్డు నెలకొల్పాడు.


డీఆర్ఎస్‌లో జ‌డ్డూ వ‌రుస‌గా ఫెయిల‌వుతూ వ‌స్తున్నాడు. గత మూడేళ్ల నుంచి ఇప్పటి వరకు అత‌డు వ‌రుస‌గా 22 రివ్యూలు తీసుకున్నాడు. అందులో 18 రివ్యూలు విఫలమయ్యాయి. కేవలం నాలుగు ద‌ఫాలు అంపైర్ కాల్‌గా వెళ్లాయి. దీంతో ఇన్ని రివ్యూలు కోల్పోయిన తొలి ఆల్‌రౌండ‌ర్‌గా జ‌డేజా చెత్త రికార్డు మూట‌గ‌ట్టుకున్నాడు. చివ‌రిసారిగా 2023లో జ‌డేజా తీసుకున్న‌ రివ్యూ విజ‌య‌వంత‌మైంది.


ఆ తర్వాత నుంచి జ‌డేజా మ‌ళ్లీ రివ్యూల్లో స‌క్సెస్ కాలేదు. అందుకే కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్ జాగ్రత్తగా ఉండాలని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గ‌తంలో ఆటగాళ్లు పట్టుబట్టినా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ రివ్యూలు తీసుకునే వాడు కాదు. ఆ విషయాన్ని గిల్ కూడా గ్రహించాల్సిన అవ‌స‌ర‌ముంది. ఇక జ‌డేజా ఇప్ప‌టివ‌ర‌కు 90 టెస్టుల్లో 4,117 ప‌రుగులు చేయ‌డంతో పాటు 352 వికెట్లు ప‌డ‌గొట్టాడు.


ఇవి కూడా చదవండి:

వీరేంద్ర సెహ్వాగ్‌ను గుర్తు చేస్తున్న తనయుడు ఆర్యవీర్

ఫాలోఆన్‌ తప్పేనా?

Updated Date - Aug 26 , 2026 | 07:40 AM