ఢిల్లీలో 2,308 స్వైన్ ఫ్లూ కేసులు నమోదు
ABN , Publish Date - Aug 26 , 2026 | 07:13 AM
దేశ రాజధాని ఢిల్లీని స్వైన్‌ఫ్లూ (హెచ్1ఎన్1) వణికిస్తోంది. నగరంలో ఈ ఏడాది ఇప్పటివరకు 2,308 స్వైన్‌ఫ్లూ కేసులు నమోదయ్యాయి. మొత్తంగా...
న్యూఢిల్లీ, ఆగస్టు 25: దేశ రాజధాని ఢిల్లీని స్వైన్‌ఫ్లూ (హెచ్1ఎన్1) వణికిస్తోంది. నగరంలో ఈ ఏడాది ఇప్పటివరకు 2,308 స్వైన్‌ఫ్లూ కేసులు నమోదయ్యాయి. మొత్తంగా ఇన్‌ఫ్లుయెంజా కేసులు 3,000లకు పైగా నమోదయ్యాయి. గత నాలుగైదు రోజుల్లోనే హెచ్1ఎన్1 కేసులు అమాంతం పెరగటంతో నగరంలోని ఆస్పత్రులు రోగులతో నిండిపోతున్నాయి. స్వైన్‌ఫ్లూ కేసులు వేగంగా పెరుగుతుండటంతో ఢిల్లీ ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రతి ఆస్పత్రిలో స్వైన్‌ఫ్లూ రోగుల కోసం ఒక ఐసోలేషన్ గదిని ఏర్పాటు చేయాలని సీఎం రేఖాగుప్తా ఆదేశించారు. కాగా, ఢిల్లీలో ప్రస్తుతం వ్యాపిస్తున్న హెచ్1ఎన్1 వైరస్ కొత్తదేమీ కాదని ఐసీఎంఆర్, ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు తెలిపారు.
ఈ వార్తలనూ చదవండి:
ఏడేళ్ల తర్వాత భారత్‌కు జిన్‌పింగ్.. బ్రిక్స్ సదస్సుకు 400 మందితో భారీ బృందం..
ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీకి సంబంధించిన అరుదైన వీడియో విడుదల!