ప్రభాత్ ఖాతాలో డీమెరిట్ పాయింట్
ABN , Publish Date - Aug 26 , 2026 | 04:13 AM
శ్రీలంక స్పిన్నర్ ప్రభాత్ జయసూర్యపై ఐసీసీ క్రమశిక్షణా చర్యలు తీసుకుంది. సోమవారం రెండో రోజు ఆట చివరి బంతికి...
శ్రీలంక స్పిన్నర్ ప్రభాత్ జయసూర్యపై ఐసీసీ క్రమశిక్షణా చర్యలు తీసుకుంది. సోమవారం రెండో రోజు ఆట చివరి బంతికి ప్రభాత్ అవుటయ్యాడు. దీంతో అసహనం వ్యక్తం చేస్తూ పెవిలియన్‌కు చేరే క్రమంలో బౌండరీ లైన్‌ను బ్యాట్‌తో బలంగా కొట్టాడు. క్రికెట్ పరికరాలు, దుస్తులు, మైదాన సామగ్రిని ధ్వంసం చేయడం ఐసీసీ రూల్ ఆఫ్ కండక్ట్ లెవెల్ 1ను అతిక్రమించినట్టవుతుంది. దీంతో ప్రభాత్‌ను మందలించడంతో పాటు అతడి ఖాతాలో ఓ డీమెరిట్ పాయింట్‌ను చేర్చారు.