Share News

రాత్రిళ్లూ.. రయ్‌ రయ్‌

ABN , Publish Date - Aug 26 , 2026 | 09:22 AM

గ్రేటర్‌ హైదరాబాద్‌లో 24 గంటలు 6 రూట్లలో 15 బస్సులను ఆర్టీసీ నడపనుంది.

రాత్రిళ్లూ.. రయ్‌ రయ్‌
Hyderabad RTC night buses

  • 6 రూట్లు.. 15 ఆర్టీసీ బస్సులు.. సెప్టెంబరు 1 నుంచి ప్రారంభం

  • ప్రస్తుతం రద్దీ ఉన్న ప్రాంతాల్లో సేవలు

హైదరాబాద్‌ సిటీ: గ్రేటర్‌లో 24 గంటలు 6 రూట్లలో 15 బస్సులను ఆర్టీసీ నడపనుంది. సెప్టెంబరు 1 నుంచి రాత్రి వేళల్లో ప్రయాణికుల రద్దీ ఉన్న ప్రాంతాల మీదుగా ఆరు రూట్లలో రాత్రంతా ప్రత్యేక సర్వీసులు నడిపేలా రూట్‌మ్యాప్‏లు సిద్ధం చేశారు. గతంలో నైట్‌ సర్వీసులు ఆక్యుపెన్సీ లేకపోవడంతో రద్దు చేయడం విదితమే. ఈ నేపథ్యంలో ఈ తరహా సమస్యలు తలెత్తకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు.


రాత్రి పూట ప్రయాణికుల డిమాండ్‌ ఆధారంగా భవిష్యత్తులో మరిన్ని సర్వీసులు పెంచే అవకాశాలు పరిశీలిస్తామని గ్రేటర్‌ ఆర్టీసీ ఈడీ శ్రీధర్‌ తెలిపారు. రాత్రి సర్వీసులను ఐటీ ఉద్యోగులతో పాటు ఆఫీసుల్లో షిప్టుల వారీగా పనిచేసే ఉద్యోగులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. రాత్రి సర్వీసుల నిర్వహణ పై ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటునట్లు ఉన్నతాధికారులు తెలిపారు. ఎలాగో పగటి పూట ఈ సర్వీసులు నడుస్తున్నాయి.. రాత్రిళ్లూ ఈ రద్దీ రూట్లలో నడబోతుండటంపై ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


సేవలిలా..

  • రూట్‌ 222ఏకు 4 బస్సులు - కోఠి నుంచి పటాన్‌చెరు: కోఠి నుంచి అబిడ్స్‌, లక్డీకపుల్‌, ముషీరాబాద్‌, కేర్‌ ఆస్పత్రి, అన్నపూర్ణ, ఉషాకిరణ్‌, గుట్టలబేగంపేట, హైటెక్‌సిటీ, కొండాపూర్‌ ఎక్స్‌రోడ్‌, హఫీజ్‌పేట, లింగంపల్లి, రామచంద్రాపురం, బీరంగూడ, పటాన్‌చెరు నడుస్తాయి. కోఠి- పటాన్‌చెరు దిశలో రాత్రి 10.45 గంటల నుంచి ఉదయం 4.30 గంటల వరకు, పటాన్‌చెరు- కోఠి దిశలో రాత్రి 11 గంటల నుంచి ఉదయం 4.55 వరకు నడుపుతారు.


  • రూట్‌ నం.218కు 2 బస్సులు - కోఠి నుంచి పటాన్‌చెరు: కోఠి నుంచి లక్డీకపుల్‌, ఎస్‌ఆర్‌నగర్‌, ముషీరాబాద్‌, కేపీహెచ్‌బీ, మియాపూర్‌, లింగంపల్లి, రామచంద్రాపురం మీదుగా పటాన్‌చెరు వరకు నడుస్తాయి. రాత్రి వేళల్లో 1.15 నిమిషాల ప్రీక్వెన్సీతో నాలుగు టిప్పులు నడుపుతారు.


city3.2.jpg

  • రూట్‌ నం. 219- ఒక బస్సు.. సికింద్రాబాద్‌ నుంచి పటాన్‌చెరు: సికింద్రాబాద్‌, పార డైస్‌, తార్నాక, నింబోలిపల్లి, బాలానగర్‌ ఎక్స్‌రోడ్‌, ఐడీపీఎల్‌, ప్రశాంత్‌నగర్‌, కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ, గంగారం, లింగంపల్లి, రామచంద్రాపురం, పటాన్‌చెరు ప్రాంతాలకు నడుపుతారు.


  • రూట్‌ నం. 290 యూకు 3 బస్సులు - హయత్‌నగర్‌ నుంచి సికింద్రాబాద్‌ కారిడార్‌ : ఈ మార్గంలో భాగ్యలత, పనమ్‌, ఎల్‌బీనగర్‌, అల్కాపురి, నాగోల్‌, నాగోల్‌మెట్రో స్టేషన్‌, సర్వేఆఫ్‌ ఇండియా, ఎన్‌జీఆర్‌ఐ, తార్నాక, ఆలుగడ్డ బావి, సికింద్రాబాద్‌ అల్ఫా మీదుగా నడుపుతారు. రాత్రంతా 40 నిమిషాల వ్యవధిలో అందుబాటులో ఉంటాయి.


  • రూట్‌ నం. 195కు 3 బస్సులు .. డబ్ల్యూ -బాచుపల్లి నుంచి వేవ్‌రాక్‌ : బాచుపల్లి, నిజాంపేట, నిజాంపేట్‌ ఎక్స్‌రోడ్‌, కేపీహెచ్‌బీ మెయిన్‌ రోడ్‌, హైటెక్‌ సిటీ, ఈఎస్ఐసీ, ఇందిరానగర్‌, ఇన్ఫోసిస్‌, ఇన్ఫోటెక్‌, వేవ్‌రాక్‌ వరకు నడుపుతారు. రాత్రి 9 గంటల నుంచి తెల్లవారు జాము 4.20 వరకు, 40 నిమిషాల వ్యవధిలో బస్సులు అందుబాటులో ఉంటాయి.


  • రూట్‌ నం. 10 హెచ్‌కు 2 బస్సులు- సికింద్రాబాద్‌ నుంచి కొండాపూర్‌ మార్గంలో 60 నిమిషాల విరామంతో నడుపుతారు. ఐటీ కారిడార్‌ మధ్య ప్రయాణించే ఉద్యోగులు, ఇతర ప్రయాణికులు ఈ సేవలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

కొద్దిగా తగ్గాయి.. ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..

శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటలు

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Aug 26 , 2026 | 09:27 AM