Share News

పులివెందుల అర్బన్ సీఐ శ్రీరామ్‌పై బదిలీ వేటు

ABN , Publish Date - Aug 26 , 2026 | 08:05 AM

కడప జిల్లాలోని పులివెందుల అర్బన్ సీఐ శ్రీరామ్‌పై ఏపీ ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. కడప వీఆర్‌కు ఆయనను బదిలీ చేసింది. పులివెందులలో వైఎస్ వివేకా కుటుంబ సభ్యుల భూమి కబ్జాకు గురైనట్లు కలెక్టర్, ఆర్డీఓలకు ‌ వైఎస్ సునీతారెడ్డి ఫిర్యాదు చేశారు.

పులివెందుల అర్బన్ సీఐ శ్రీరామ్‌పై బదిలీ వేటు
Pulivendula Urban CI Sriram

కడప, ఆగస్టు26 (ఆంధ్రజ్యోతి): కడప జిల్లాలోని పులివెందుల అర్బన్ సీఐ శ్రీరామ్‌పై ఏపీ ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. కడప వీఆర్‌కు ఆయనను బదిలీ చేసింది. పులివెందులలో వైఎస్ వివేకా కుటుంబ సభ్యుల భూమి కబ్జాకు గురైనట్లు కలెక్టర్, ఆర్డీఓలకు ‌వైఎస్ సునీతారెడ్డి ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు ఈ కబ్జాపై పులివెందుల ఆర్డీవో చిన్నయ్య విచారించారు.


ఓ కబ్జా బ్యాచ్ కబ్జా చేసి నకిలీ పాసుపుస్తకాలు సృష్టించినట్లు విచారణలో నిర్ధారించారు. కబ్జా చేసిన అక్రమార్కులపై పులివెందుల అర్బన్ పోలీస్ స్టేషన్‌లో ఆర్డీఓ చిన్నయ్య ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసినా నిందితులను సీఐ శ్రీరామ్ అరెస్ట్ చేయలేదు. ఈ క్రమంలోనే డీఐజీ కోయ ప్రవీణ్ సీఐ శ్రీరామ్‌ను వీఆర్‌‌కు బదిలీ చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి...

పైలట్ల డోప్ టెస్టులపై కేంద్రం ఫోకస్‌.. ఏడాదికి ఒకసారి పరీక్షకు యోచన: రామ్మోహన్

బీసీలను జగన్ రెడ్డి మోసం చేస్తున్నారు.. యనమల ధ్వజం

వన మహోత్సవం లక్ష్యాలను నిర్ణీత గడువులో పూర్తి చేయాలి: మంత్రి సీతక్క

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Aug 26 , 2026 | 08:18 AM