Share News

బీసీలను జగన్ రెడ్డి మోసం చేస్తున్నారు.. యనమల ధ్వజం

ABN , Publish Date - Aug 25 , 2026 | 07:16 AM

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీలను ఆయన మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు.

బీసీలను జగన్ రెడ్డి మోసం చేస్తున్నారు.. యనమల ధ్వజం
Yanamala Ramakrishnudu

అమరావతి, ఆగస్టు 25 (ఆంధ్రజ్యోతి): వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు (Yanamala Ramakrishnudu) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీలను ఆయన మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఈరోజు (మంగళవారం) యనమల ఓ ప్రకటన విడుదల చేశారు. జగన్ విధానం రెండు రకాలుగా ఉంటుందని అన్నారు.


ఒకటి, బలహీన వర్గాలను (ముఖ్యంగా బీసీలను) బలిపశువులను చేయడం, రెండవది, మద్యం కుంభకోణం వంటి అవినీతి వ్యవహారాల నుంచి తనను తాను రక్షించుకోవడానికి తన పార్టీలోని బీసీ నాయకులను నేర లేదా అవినీతి కేసుల్లో ఇరికించడమని యనమల ఆరోపించారు. బలహీన వర్గాలు (SC, ST, BC) రాజకీయంగా, ఆర్థికంగా సాధికారత సాధించాలని జగన్, వైసీపీ ఎప్పుడూ కోరుకోలేదని చెప్పారు. బలహీన వర్గాల సమస్యలను పరిష్కరించడంలో వారికి టీడీపీ మాత్రమే అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని వ్యాఖ్యానించారు. అంతేకాకుండా, టీడీపీ ఆవిర్భావం నుంచి బీసీలే టీడీపీకి వెన్నుముకగా నిలిచారని యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

స్వదేశీ విధానంతో స్వయం సమృద్ధి సాధించాలి: సీఎం చంద్రబాబు

ఆ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. 62 ఏళ్ల వరకు రిటైర్‌మెంట్ పెంపు

సాధిక్ ఖాన్ కరుడుగట్టిన నేరస్థుడు: విజయసాయి రెడ్డి

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Aug 25 , 2026 | 07:52 AM