Share News

ఆ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. రిటైర్‌మెంట్ వయసు 62కు పెంపు..

ABN , Publish Date - Aug 24 , 2026 | 01:29 PM

గిరిజన గురుకుల ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ఆ ఉద్యోగులకు 62 ఏళ్ల వరకూ రిటైర్‌మెంట్ పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది.

ఆ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. రిటైర్‌మెంట్ వయసు 62కు పెంపు..
AP Government

అమరావతి, ఆగస్టు 24 (ఆంధ్రజ్యోతి): గిరిజన గురుకుల ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (AP Government) శుభవార్త తెలిపింది. ఆ ఉద్యోగులకు 62 ఏళ్ల వరకు రిటైర్‌మెంట్ పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. APTWREIS (గురుకులం) రెగ్యులర్ బోధన, బోధనేతర ఉద్యోగులకు వర్తిస్తుందని స్పష్టం చేసింది. పదవీ విరమణ వయసు 60 నుంచి 62 ఏళ్లకు పెంచుతున్నట్లు పేర్కొంది. జులై 2026 నుంచి రిటైర్ అయ్యే అర్హులైన ఉద్యోగులకు కొనసాగింపు ఉంటుందని తెలిపింది.


ఫైనాన్స్ శాఖ జీవో నంబర్-45 నిబంధనల మేరకు ఈ ఉత్తర్వులను అమలు చేస్తున్నట్లు ఏపీ సర్కార్ వెల్లడించింది. రీ-ఇండక్షన్ కాలానికి వేతన బకాయిలు ఉండవని చెప్పింది. అదనపు పోస్టులను సృష్టించకుండా ఈ ఉత్తర్వులను అమలు చేయాలని ఏపీ సర్కార్ ఆదేశించింది. 2026-27 బడ్జెట్ పరిధిలోనే వ్యయం చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. అవసరమైతే 28 మంది బోధన సిబ్బందికి కూడా రూ.4.12 కోట్ల అదనపు నిధుల ప్రతిపాదన చేస్తామని తెలిపింది. ఈ మేరకు గిరిజన సంక్షేమ శాఖ జీవో ఎంఎస్ నంబర్ -33ను జారీ చేసింది.


ఈ వార్తలు కూడా చదవండి...

మోదీ నాయకత్వంలో భారత అంతరిక్ష రంగం కొత్త శకంలోకి: పవన్ కల్యాణ్

అల్పపీడన ప్రభావం.. ఏపీలో వర్షాలు

వెలిగొండ ప్రాజెక్ట్.. ఆఖరి లబ్ధిదారుడి వరకూ పరిహారం అందిస్తాం: మంత్రి డీజీవీ స్వామి

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Aug 24 , 2026 | 04:33 PM