వెలిగొండ ప్రాజెక్ట్.. ఆఖరి లబ్ధిదారుడి వరకూ పరిహారం అందిస్తాం: మంత్రి డీజీవీ స్వామి
ABN , Publish Date - Aug 23 , 2026 | 12:04 PM
వెలిగొండ ప్రాజెక్టుకు ఈనెల 31వ తేదీన సీఎం చంద్రబాబు నీళ్లు విడుదల చేస్తారని ఏపీ మంత్రి బాలవీరాంజనేయస్వామి వ్యాఖ్యానించారు. తమ ప్రభుత్వం చెప్పిన మాట ప్రకారం వెలిగొండకు నీళ్లు ఇస్తున్నామని పేర్కొన్నారు.
ప్రకాశం, ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి): వెలిగొండ ప్రాజెక్టుకు ఈనెల 31వ తేదీన సీఎం చంద్రబాబు నీళ్లు విడుదల చేస్తారని ఏపీ మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి (AP Minister Dola Balaveeranjaneyaswamy) వ్యాఖ్యానించారు. తమ ప్రభుత్వం చెప్పిన మాట ప్రకారం వెలిగొండకు నీళ్లు ఇస్తున్నామని పేర్కొన్నారు. ఈరోజు (ఆదివారం) ప్రకాశం జిల్లాలో మంత్రి డీబీవీ స్వామి పర్యటించి, పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.
1996లో సీఎం చంద్రబాబు వెలిగొండకు శంకుస్థాపన చేశారని మంత్రి ప్రస్తావించారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో ఈ ప్రాజెక్టు పనులు పూర్తి కాకుండానే ప్రారంభించారని అన్నారు. నిర్వాసితులకు మూడు విడతలుగా పరిహారం పంపిణీ చేశామని వెల్లడించారు. ఆఖరి లబ్ధిదారుడి వరకూ పరిహారం అందిస్తామని మాటిచ్చారు. శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రే వెలిగొండను ప్రారంభిస్తున్నారని చెప్పుకొచ్చారు. పోలవరం ఎడమ కాలువ నుంచి కూడా నీళ్లు ఇస్తున్నామని తెలపారు. సీఎం చంద్రబాబు అపర భగీరథుడిగా మహాయజ్ఞం చేస్తున్నారని మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి పేర్కొన్నారు.
వార్తలు కూడా చదవండి...
ఉద్యోగాలు, ప్రతిభకు దేశంలోనే నంబర్‌వన్ సిటీగా విశాఖ: సీఎం చంద్రబాబు
పవన్ కల్యాణ్ దిశానిర్దేశం.. శరవేగంగా అడవుల పునరుద్ధరణ కార్యక్రమం
ఈ ఏడాది మరో 3వేల టీచర్ పోస్టుల భర్తీ: మంత్రి లోకేశ్
Read Latest AP News And Telangana News And National News
And Telugu News