పవన్ కల్యాణ్ దిశానిర్దేశం.. శరవేగంగా అడవుల పునరుద్ధరణ కార్యక్రమం
ABN , Publish Date - Aug 22 , 2026 | 08:19 PM
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నిర్దేశకత్వంతో శరవేగంగా అడవుల పునరుద్ధరణ కార్యక్రమం కొనసాగుతోంది. డిప్యూటీ సీఎం ఆదేశాలతో జోరుగా సీడ్ బాల్స్ వెదజల్లే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
అమరావతి, ఆగస్టు 22 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) నిర్దేశకత్వంతో శరవేగంగా అడవుల పునరుద్ధరణ కార్యక్రమం కొనసాగుతోంది. డిప్యూటీ సీఎం ఆదేశాలతో జోరుగా సీడ్ బాల్స్ వెదజల్లే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. 20 వేల హెక్టార్లలో 2 కోట్లకు పైగా సీడ్ బాల్స్‌ను అధికారులు వెదజల్లారు. ఈ మేరకు 50 శాతం గ్రీన్ కవర్ లక్ష్య సాధనలో కీలక అడుగు పడింది.
అడవుల పునరుద్ధరణ ప్రక్రియలో డ్రోన్ సాంకేతికత కీలక పాత్ర పోషిస్తోంది. తిరుపతి, అనంతపురం, కర్నూలు, గుంటూరు, రాజమహేంద్రవరం, ఎన్టీఆర్, విశాఖపట్నం జిల్లాల పరిధిలో విస్తృతంగా ఈ కార్యక్రమం కొనసాగుతోంది. ఈ సీజన్‌లో 3 కోట్లకు పైగా విత్తన బంతులు వెదజల్లాలని లక్ష్యంగా అధికారులు తీసుకున్నారు. సీడ్ బాల్స్ విస్తరణ ప్రక్రియ సరికొత్త మైలురాయిని చేరుకున్న సందర్భంగా అటవీశాఖ సిబ్బందితో పాటు ప్రతి ఒక్కరినీ పవన్ కల్యాణ్ అభినందించారు.
ఈ వార్తలు కూడా చదవండి...
హరీశ్‌రావు కాదు.. అబద్దాల రావు.. మంత్రి పొంగులేటి సెటైర్లు
ఆ భూములను లాక్కుంటే.. చూస్తూ ఊరుకోం.. రేవంత్ సర్కార్‌కు కవిత వార్నింగ్
Read Latest AP News And Telangana News And National News
And Telugu News