ఆ భూములను లాక్కుంటే.. చూస్తూ ఊరుకోం.. రేవంత్ సర్కార్‌కు కవిత వార్నింగ్
ABN , Publish Date - Aug 18 , 2026 | 12:59 PM
తాము అధికారంలోకి వస్తే ‘భూలక్ష్మి’ పేరుతో పేదలకు భూమి పంపిణీ చేస్తామని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. పేదల భూములను రేవంత్‌రెడ్డి సర్కార్ లాక్కుంటే.. చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు.
హైదరాబాద్, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి): తాము అధికారంలోకి వస్తే ‘భూలక్ష్మి’ పేరుతో పేదలకు భూమి పంపిణీ చేస్తామని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) పేర్కొన్నారు. పేదల భూములను రేవంత్‌రెడ్డి సర్కార్ లాక్కుంటే.. చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ఈరోజు (మంగళవారం ) హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ టీఆర్ఎస్ కార్యాలయంలో కవిత మీడియాతో మాట్లాడారు. బీసీలకు పెద్దపీట వేస్తామని చెప్పినా.. ఆచరణలో మాత్రం సామాజిక న్యాయం ఎందుకు కనిపించడం లేదని ప్రశ్నించారు.
విజయశాంతి లాంటి ఉద్యమకారులను పక్కన పెట్టారు..
విజయశాంతి లాంటి ఉద్యమకారులను పక్కన పెట్టి.. మంత్రి పదవి ఇవ్వకుండా ఎమ్మెల్సీ పదవితో సరిపెట్టారని కవిత పేర్కొన్నారు. ప్రభుత్వం నియమించిన అడ్వైజర్ల జీతాల విషయంలోనే సామాజిక న్యాయం ఎందుకు కనిపించట్లేదని నిలదీశారు. రేవంత్‌రెడ్డి చెప్పేది సామాజిక న్యాయం.. కానీ ఆచరణలో మాత్రం ఆటవికా న్యాయమా..? అని ప్రశ్నించారు. అప్పర్ క్లాస్ మాట్లాడితే ఓ రకమైన చర్యలు.. లో క్లాస్ మాట్లాడితే మరో రకమైన చర్యలు తీసుకుంటారా..? ఇదేనా రేవంత్‌రెడ్డి సామాజిక న్యాయం.? అని ప్రశ్నల వర్షం కురిపించారు.
రేవంత్‌రెడ్డికి భూమి అంటే కమర్షియల్ ట్రాన్సాక్షన్..
రేవంత్‌రెడ్డికి భూమి అంటే కమర్షియల్ ట్రాన్సాక్షన్‌గా మారిపోయిందని కవిత ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ హయాంలో కూడా మూడు వేల ఎకరాల భూమిని పేదలకు ఇచ్చారని.. ఆ తర్వాత ఆపేశారని అన్నారు. ప్రభుత్వ ఆధీనంలోని, అన్యాక్రాంతమైన భూములను సేకరించి పేదలకు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. ఒక్కో కుటుంబానికి ఎకరం భూమి ఇవ్వడం సాధ్యమేనని చెప్పుకొచ్చారు. రేవంత్‌రెడ్డి - పదేపదే గతంలో జరిగిన విషయాలనే ప్రస్తావిస్తూ.. చేయాల్సిన పనులను పక్కన పెట్టకూడదని కవిత హితవు పలికారు.
వార్తలు కూడా చదవండి...
22-A పేరుతో సామాన్యులను ఇబ్బంది పెడితే సహించబోం: మంత్రి పొంగులేటి
Read Latest AP News And Telangana News And National News
And Telugu News