నటి అనసూయకు బిగ్ షాక్..
ABN , Publish Date - Aug 17 , 2026 | 09:42 AM
ప్రముఖ నటి, యాంకర్ అనసూయ భరద్వాజ్‌కు బిగ్ షాక్ తగిలింది. ఈ మేరకు బోరబండ పోలీస్ స్టేషన్‌లో బీజేపీ నాయకులు ఆమెపై కేసు నమోదు చేశారు.
హైదరాబాద్, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ నటి, యాంకర్ అనసూయ భరద్వాజ్‌కు (Anasuya Bharadwaj) బిగ్ షాక్ తగిలింది. ఈ మేరకు బోరబండ పోలీస్ స్టేషన్‌లో బీజేపీ నాయకులు ఆమెపై కేసు నమోదు చేశారు. అనసూయపై బోరబండ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసి పలు విషయాలను కాషాయం పార్టీ నేతలు ప్రస్తావించారు. హిందూమతంపై అనుచిత వ్యాఖ్యలు చేశారని బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె వ్యాఖ్యలు కోట్లాదిమంది హిందువుల మనోభావాలను దెబ్బతీశాయంటూ ఫిర్యాదులో తెలిపారు.
సోషల్ మీడియాలో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని అనసూయకు బీజేపీ నేతలు వార్నింగ్ ఇచ్చారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసిన అనసూయపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ‘జై శ్రీరామ్' ముసుగులో కొందరు దాడులకు దిగుతున్నారంటూ అనసూయ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ పోలీస్ కేసుపై తగ్గేదేలేదని అనసూయ అంటున్నారు. తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని ఆమె స్పష్టం చేశారు. తన వ్యాఖ్యలతో దొంగలంతా బయటకు వస్తున్నారని.. ఈ విమర్శకులకు అనసూయ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
వార్తలు కూడా చదవండి...
బిడ్డకే న్యాయం చేయలేని వారు.. ప్రజలకు న్యాయం చేస్తారా?: సీఎం రేవంత్
నిర్మాత బండ్ల గణేష్ కుమార్తె వివాహ వేడుక.. హాజరైన చంద్రబాబు, రేవంత్‌రెడ్డి
కేసీఆర్ పాలనకు మీ పిల్లలే రిపోర్టు కార్డు ఇస్తున్నారు: బండి సంజయ్
Read Latest AP News And Telangana News And National News
And Telugu News