Share News

నిర్మాత బండ్ల గణేష్ కుమార్తె వివాహ వేడుక.. హాజరైన చంద్రబాబు, రేవంత్‌రెడ్డి

ABN , Publish Date - Aug 16 , 2026 | 01:06 PM

ప్రముఖ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ కుమార్తె వివాహ వేడుక హైదరాబాద్‌లోని JRC కన్వెన్షన్‌లో ఘనంగా జరిగింది. ఈ వివాహ వేడుకకు పలువురు ప్రముకులు, సినీ రంగానికి చెందిన ప్రముఖులు, రాజకీయ నాయకులు హాజరయ్యారు.

నిర్మాత బండ్ల గణేష్ కుమార్తె వివాహ వేడుక.. హాజరైన చంద్రబాబు, రేవంత్‌రెడ్డి
Bandla Ganesh Daughter Wedding

హైదరాబాద్, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ కుమార్తె వివాహ వేడుక (Bandla Ganesh Daughter Wedding) హైదరాబాద్‌లోని JRC కన్వెన్షన్‌లో ఘనంగా జరిగింది. ఈ వివాహ వేడుకకు పలువురు రాజకీయ ప్రముకులు, సినీ రంగానికి చెందిన ప్రముకులు హాజరయ్యారు. ఈ వేడుకకు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, ఏ. రేవంత్‌రెడ్డి, తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా, మాజీ మంత్రి కేటీఆర్, ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత, ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు, మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. JRC కన్వెన్షన్‌కు చేరుకుని నూతన వధూవరులను కలిసి వారికి సీఎం రేవంత్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. వారి వైవాహిక జీవితం సుఖసంతోషాలతో సాగాలని ఆకాంక్షించారు.


అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. సీఎంల రాకతో వివాహ వేడుకకు మరింత ప్రత్యేకత సంతరించుకుంది. బండ్ల గణేష్ కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రులను సాదరంగా ఆహ్వానించి స్వాగతం పలికారు. కుటుంబ సభ్యులు, సన్నిహితులు, ఆత్మీయుల సమక్షంలో వివాహ వేడుక వైభవంగా జరిగింది.


వార్తలు కూడా చదవండి...

జీఆర్ఎంబీ అజెండా నుంచి తెలంగాణ వ్యతిరేక అంశాలు తొలగించాలి: హరీశ్‌రావు

నేరాల స్వరూపం ఎప్పటికప్పుడు మారుతోంది: డీజీపీ ఆనంద్

నకిలీ ట్రేడింగ్ యాప్‌తో బురిడీ.. సీఏను మోసం చేసిన సైబర్ కేటుగాళ్లు

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Aug 16 , 2026 | 01:21 PM