Share News

హైదరాబాద్‌లో యువతి దారుణ హత్య

ABN , Publish Date - Aug 17 , 2026 | 08:50 AM

హైదరాబాద్‌లోని బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువతి దారుణ హత్యకు గురైంది. ప్రియురాలిని ప్రియుడు హత్య చేసినట్లు తెలుస్తోంది. ప్రియురాలిపై అనుమానమే ఈ హత్యకు కారణమని బాలాపూర్ పోలీసులు భావిస్తున్నారు.

హైదరాబాద్‌లో యువతి దారుణ హత్య
Hyderabad Balapur Case

హైదరాబాద్, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లోని బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువతి దారుణ హత్యకు గురైంది. ప్రియురాలిని ప్రియుడు హత్య చేసినట్లు తెలుస్తోంది. ప్రియురాలిపై అనుమానమే ఈ హత్యకు కారణమని బాలాపూర్ పోలీసులు భావిస్తున్నారు. సమాచారం అందగానే ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. క్లూస్ టీమ్‌ సాయంతో ఆధారాలు సేకరిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ కేసు విచారణను పోలీసులు వేగవంతం చేశారు. నిందితుడి కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.


మృతురాలిని బిహార్‌కు చెందిన యువతిగా గుర్తించారు. స్థానికంగా ఓ ఫంక్షన్ హాల్లో మృతురాలు పనిచేస్తోంది. మృతురాలికి ప్రేమ పేరుతో బాలాపూర్‌కు చెందిన అహ్మద్ దగ్గరయ్యాడు. ఇటీవల యువతి గర్భం దాల్చింది. ఈ విషయాన్ని అహ్మద్‌కు మృతురాలు చెప్పడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగినట్లు సమాచారం. ఆమె గర్భం దాల్చడంతో తనను పెళ్లి చేసుకోవాలని అతడిని బలవంతం చేసింది. దీంతో ప్రియురాలిని అడ్డు తొలగించుకోవడానికి ప్రియుడు ప్లాన్ చేశాడు.


తల్లిదండ్రులతో కలిసి యువతిని అహ్మద్ హత్య చేసినట్లు సమాచారం. నిన్న (ఆదివారం) రాత్రి మృతదేహాన్ని గోనే సంచిలో తరలిస్తుండగా స్థానికులు అనుమానించారు. వెంటనే పోలీసులకు స్థానికులు సమాచారం ఇచ్చారు. స్థానికుల సమాచారంతో రెడ్ హ్యాండెడ్‌గా అహ్మద్‌ను పోలీసులు పట్టుకున్నారు. అహ్మద్‌తో పాటు అతని తల్లిదండ్రులను కూడా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ప్రస్తుతం ఉస్మానియా మార్చురీలో యువతి మృతదేహాన్ని ఉంచారు.


వార్తలు కూడా చదవండి...

బిడ్డకే న్యాయం చేయలేని వారు.. ప్రజలకు న్యాయం చేస్తారా?: సీఎం రేవంత్‌

నిర్మాత బండ్ల గణేష్ కుమార్తె వివాహ వేడుక.. హాజరైన చంద్రబాబు, రేవంత్‌రెడ్డి

కేసీఆర్ పాలనకు మీ పిల్లలే రిపోర్టు కార్డు ఇస్తున్నారు: బండి సంజయ్

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Aug 17 , 2026 | 09:40 AM