Share News

సూర్యాపేట జిల్లాలో రోడ్డు ప్రమాదం.. సీఎం రేవంత్‌రెడ్డి దిగ్భ్రాంతి

ABN , Publish Date - Aug 26 , 2026 | 08:46 AM

సూర్యాపేట జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కోదాడ మండలం ద్వారకుంట దగ్గర కంటైనర్‌ను ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టిన విషయం తెలిసిందే.

సూర్యాపేట జిల్లాలో రోడ్డు ప్రమాదం.. సీఎం రేవంత్‌రెడ్డి దిగ్భ్రాంతి
Suryapet Road Accident

సూర్యాపేట జిల్లా, ఆగస్టు26 (ఆంధ్రజ్యోతి): సూర్యాపేట జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కోదాడ మండలం ద్వారకుంట దగ్గర కంటైనర్‌ను ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టిన విషయం తెలిసిందే. మృతుల కుటుంబాలకు సీఎం ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ సీఎస్‌ను సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు.


బస్సు ప్రమాదంపై మంత్రుల దిగ్భ్రాంతి

ఈ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదంపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

కోదాడ మండలం దోరకుంట సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదంలో మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.


ప్రమాద స్థలాన్ని పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ

కోదాడ బస్సు ప్రమాద స్థలాన్ని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, ఎస్పీ కె. నరసింహ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ నరసింహ మాట్లాడారు. బస్సు డ్రైవర్ అతివేగం నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగిందని వెల్లడించారు. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారని.. 12 మంది గాయపడ్డారని తెలిపారు. క్షతగాత్రులను ఖమ్మం, విజయవాడ, కోదాడ ఆస్పత్రులకు తరలించామని ఎస్పీ నరసింహ పేర్కొన్నారు.


మెరుగైన వైద్యం అందేలా ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలి: కేటీఆర్

Ktr.jpg

సూర్యాపేట జిల్లా కోదాడ మండలం ద్వారకుంట సమీపంలో హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కంటైనర్‌ను ఢీకొన్న ఈ ప్రమాదంలో పలువురు ప్రాణాలు కోల్పోవడం అత్యంత విషాదకరమని చెప్పారు. మృతుల కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని అన్నారు. ఈ విషాదాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని వారి కుటుంబాలకు ఇవ్వాలని ప్రార్థిస్తున్నానని తెలిపారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందేలా ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు. క్షతగాత్రులకు అవసరమైన అన్ని వైద్య సేవలు అందిస్తూ, వారి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కేటీఆర్ ఆకాంక్షించారు.


సూర్యాపేట రోడ్డు ప్రమాదంపై హరీశ్ రావు దిగ్భ్రాంతి

Harish rao.jpg

సూర్యాపేట జిల్లా కోదాడ మండలం దుర్గాపురం స్టేజ్ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత, మాజీ మంత్రి హరీశ్‌రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో పలువురు ప్రయాణికులు మృతిచెందడం అత్యంత బాధాకరమని అన్నారు. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైన ఈ ఘటనలో గాయపడి కోదాడ ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులకు ప్రభుత్వం తక్షణమే మెరుగైన వైద్య సేవలు అందించాలని డిమాండ్ చేశారు. గాయపడిన వారు త్వరగా పూర్తిస్థాయిలో కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థించారు. ఊహించని ఈ ప్రమాదంలో ఆత్మీయులను కోల్పోయి శోకసంద్రంలో ఉన్న బాధిత కుటుంబాలను ప్రభుత్వం తక్షణమే స్పందించి అన్ని విధాలుగా ఆదుకోవాలని హరీశ్‌రావు కోరారు.


ఈ వార్తలు కూడా చదవండి...

జనగణన పద్ధతిపై రాహుల్, ఖర్గే నిరసన.. ప్రధాని మోదీకి సుదీర్ఘ లేఖ

నషా ముక్త్ సమాజ నిర్మాణంలో యువత పాత్ర కీలకం: గవర్నర్

పైలట్ల డోప్ టెస్టులపై కేంద్రం ఫోకస్‌.. ఏడాదికి ఒకసారి పరీక్షకు యోచన: రామ్మోహన్

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Aug 26 , 2026 | 09:49 AM