Share News

నషా ముక్త్ సమాజ నిర్మాణంలో యువత పాత్ర కీలకం: గవర్నర్

ABN , Publish Date - Aug 25 , 2026 | 01:11 PM

నషా ముక్త్ సమాజ నిర్మాణంలో యువత పాత్ర కీలకమని తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా వ్యాఖ్యానించారు. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి, విద్యా క్రీడా రంగాల్లో రాణించాలని సూచించారు.

నషా ముక్త్  సమాజ నిర్మాణంలో యువత పాత్ర కీలకం: గవర్నర్
Telangana Governor Shiv Pratap Shukla

నిజామాబాద్, ఆగస్టు 25 (ఆంధ్రజ్యోతి): నషా ముక్త్ సమాజ నిర్మాణంలో యువత పాత్ర కీలకమని తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా (Telangana Governor Shiv Pratap Shukla) వ్యాఖ్యానించారు. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి, విద్యా క్రీడా రంగాల్లో రాణించాలని సూచించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలో నషా ముక్త్ భారత్ అభియాన్ ప్రజా ఉద్యమంగా రూపుదిద్దుకుంటుందని పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లాలో ఈరోజు (మంగళవారం) నషా ముక్త్ భారత్‌ అభియాన్‌పై విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు.


ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా, ఎంపీ అర్వింద్, ఎమ్మెల్యేలు సూర్యనారాయణ, రాకేశ్ రెడ్డి, జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా, పోలీసు కమిషనర్ సాయి చైతన్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడారు. పిల్లల ప్రవర్తనను తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. నషా ముక్త్ భారత్ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా పిలుపునిచ్చారు.


నేటి యువతలో మత్తు పదార్థాల వాడకం పెరిగింది: ఎంపీ అరవింద్

 Nizamabad MP Dharmapuri

నేటి యువతలో మత్తు పదార్థాల వాడకం పెరిగిందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ పేర్కొన్నారు. మత్తుతో అనేక కుటుంబాలు ఛిన్నాభిన్నాం అవుతున్నాయని తెలిపారు. ఆరోగ్యాలు కూడా పాడవుతున్నాయని చెప్పారు. మత్తుతో స్నేహం వద్దని.. మత్తు మన శత్రువుని తెలిపారు. యువత డ్రగ్స్‌కు బానిసలై తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని చెప్పారు. తెలంగాణను డ్రగ్స్ రహిత ప్రాంతంగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకోవాలని ఎంపీ అరవింద్ పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

మంత్రి కొండా సురేఖ వ్యవహారంపై నివేదిక సిద్ధం చేసిన క్రమశిక్షణ కమిటీ

సీఎంసీ ఫిర్యాదుతో హైడ్రా యాక్షన్.. ప్రమాదకర భవనం తొలగింపు

చికెన్ వ్యర్థాలపై అధికారుల చర్యలు.. 100 టన్నుల స్వాధీనం

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Aug 25 , 2026 | 01:49 PM