Share News

సీఎంసీ ఫిర్యాదుతో హైడ్రా యాక్షన్.. ప్రమాదకర భవనం తొలగింపు

ABN , Publish Date - Aug 24 , 2026 | 11:12 AM

హైదరాబాద్‌లోని గచ్చిబౌలి అంజయ్య నగర్‌లో హైడ్రా - సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు సోమవారం సంయుక్త ఆపరేషన్ చేపట్టారు. శనివారం కుప్పకూలిన భవనం పక్కనే ఉన్న మరో ఏడంతస్తుల బిల్డింగ్‌ను అధికారులు కూల్చివేశారు.

సీఎంసీ ఫిర్యాదుతో హైడ్రా యాక్షన్.. ప్రమాదకర భవనం తొలగింపు
HYDRA - CMC Joint Operation

హైదరాబాద్, ఆగస్టు 24 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లోని గచ్చిబౌలి అంజయ్య నగర్‌లో హైడ్రా - సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(CMC) అధికారులు ఈరోజు (సోమవారం) సంయుక్త ఆపరేషన్ చేపట్టారు. అంజయ్య నగర్‌లో శనివారం కుప్పకూలిన భవనం పక్కనే ఉన్న మరో ఏడంతస్తుల బిల్డింగ్‌ను అధికారులు కూల్చివేశారు. ఆ ప్రాంతంలో ఈ భవనం ప్రమాదకరంగా మారడంతో తొలగించారు. పక్కనే ఉన్న భవనాలకు ముప్పు లేకుండా చర్యలు చేపట్టారు.


బాహుబలి జేసీబీతో తొలగింపు పనులను అధికారులు ప్రారంభించారు. CMC అధికారుల ఫిర్యాదు మేరకు హైడ్రా ఈ చర్యలు చేపట్టింది. ముందస్తుగా పక్కనే ఉన్న వైట్ ఫీల్డ్ అపార్ట్‌మెంట్ వాసులను అధికారులు ఖాళీ చేయించారు. ఈ భవనాల మధ్య గ్యాప్ లేకపోవడంతో బిల్డింగ్ తొలగింపు ప్రక్రియ కష్టతరంగా మారింది. బాహుబలి హైరిచ్ జాక్ క్రషర్ ద్వారా బిల్డింగ్ కూల్చివేతలు చేపట్టారు. చుట్టుపక్కల బిల్డింగ్‌లు దెబ్బతినకుండా ఇంజినీరింగ్ అధికారుల పర్యవేక్షణలో ఈ తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది.

కాగా, గచ్చిబౌలిలోని అంజయ్యనగర్‌లో భవనం కూలిన ఘటనలో యజమాని సయ్యద్ సాజిద్‌ను రాయదుర్గం పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ రోజు(సోమవారం)శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

కొండా సురేఖపైన కుట్ర చేయాల్సిన ఎవరికి అవసరం లేదు: మంత్రి శ్రీహరి

గుడ్ న్యూస్.. నామినేటెడ్ పదవుల భర్తీపై మహేశ్ గౌడ్ కీలక ప్రకటన

'టాక్సిక్' సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ ప్రమాదం.. మల్లారెడ్డి కాలేజీపై కేసు నమోదు

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Aug 24 , 2026 | 12:11 PM