Share News

కొండా సురేఖపై కుట్ర చేయాల్సిన అవసరం లేదు: మంత్రి శ్రీహరి

ABN , Publish Date - Aug 23 , 2026 | 12:46 PM

కొండా సురేఖ అంశంపై మంత్రులు వరుసగా స్పందిస్తున్నారు. ఆమె వివరణను నిన్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తప్పుబట్టారు. తాజాగా ఈ విషయంపై మంత్రి వాకిటి శ్రీహరి స్పందించారు.

కొండా సురేఖపై కుట్ర చేయాల్సిన అవసరం లేదు: మంత్రి శ్రీహరి
Telangana Minister Vakiti Srihari

హైదరాబాద్, ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి): కొండా సురేఖ (Konda Surekha) అంశంపై తెలంగాణ మంత్రులు వరుసగా స్పందిస్తున్నారు. ఆమె వివరణను.. నిన్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తప్పుబట్టారు. తాజాగా ఈ విషయంపై మంత్రి వాకిటి శ్రీహరి (Telangana Minister Vakiti Srihari) స్పందించారు. కొండా సురేఖపైన కుట్ర చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఎవరు తప్పు చేసినా చర్యలు తీసుకోవాల్సిందేనని తేల్చిచెప్పారు. పార్టీకి తాను ఇబ్బంది కలిగించినా చర్యలు తీసుకోవాల్సిందేనని వ్యాఖ్యానించారు. ఎస్సీ అయినా, బీసీ అయినా చర్యలు తీసుకోవాల్సిందేనని తెలిపారు.


ఆమె మాటలు పార్టీకి డ్యామేజ్ అయ్యాయి..

పార్టీకి ఎవరూ ఎక్కువ కాదని.. ఎవరూ తక్కువ కాదని మంత్రి శ్రీహరి చెప్పుకొచ్చారు. కొండ సురేఖ కూతరు మాట్లాడిన మాటలు పార్టీకి డ్యామేజ్ అయ్యాయని అన్నారు. ముందు పార్టీ తర్వాతే అందరూ అని తేల్చిచెప్పారు. పార్టీని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతయినా ఉందని తెలిపారు. పార్టీ లేకపోతే ఎవరూ ఉండరని అన్నారు. కాంగ్రెస్‌లో AICC, PCC ఉందని.. ఈ పార్టీ వెనుక ఎవరూ ఉండరని చెప్పారు. కాంగ్రెస్‌లో జరిగే ఇంటర్నల్ ఇష్యూస్ ప్రతిపక్షాలకు ఆయుధంగా మారుతున్నాయని అన్నారు.


బీసీలపైనే కుట్ర జరుగుతుందనేది అబద్ధం..

ఇన్ని పథకాలు ఇచ్చిన కాంగ్రెస్‌‌ను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. ప్రతిపక్షాలకు ప్రభుత్వం, పార్టీ గురించి విమర్శించే అవకాశం ఇవ్వకుండా చూసుకొనే బాధ్యత తమపై ఉందని స్పష్టం చేశారు. చిన్నా రెడ్డికి కూడా కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ నోటీస్ ఇచ్చిందని ప్రస్తావించారు. బీసీలపైనే కుట్ర జరుగుతుందనేది అబద్ధమని అన్నారు. కొండా సురేఖపైన తమ పార్టీ ఓ నిర్ణయం తీసుకుంటుందని వెల్లడించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలు కలిస్తేనే కాంగ్రెస్ పార్టీ అని మంత్రి వాకిటి శ్రీహరి పేర్కొన్నారు.


వార్తలు కూడా చదవండి...

లండన్‌లో సీఎం రేవంత్‌రెడ్డితో లివర్‌పూల్ ప్రతినిధుల భేటీ

డీసీహెచ్‌ఎస్‌లు విధులకు గైర్హాజరైతే కఠిన చర్యలు: మంత్రి దామోదర్

ఆ వ్యాఖ్యల వెనుక ఉన్న అసలు వ్యక్తులను గుర్తించాలి: కొండా సురేఖ

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Aug 23 , 2026 | 03:32 PM