Share News

ఆ వ్యాఖ్యల వెనుక ఉన్న అసలు వ్యక్తులను గుర్తించాలి: కొండా సురేఖ

ABN , Publish Date - Aug 22 , 2026 | 08:10 PM

టీపీసీసీ క్రమశిక్షణ కమిటీకి తెలంగాణ మంత్రి కొండా సురేఖ మరో లేఖ రాశారు.తనను, కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని అవమానకర వ్యాఖ్యలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఆ వ్యాఖ్యల వెనుక ఉన్న అసలు వ్యక్తులను గుర్తించాలి: కొండా సురేఖ
Telangana Minister Konda Surekha

హైదరాబాద్, ఆగస్టు 22 (ఆంధ్రజ్యోతి): టీపీసీసీ క్రమశిక్షణా కమిటీకి తెలంగాణ మంత్రి కొండా సురేఖ (Telangana Minister Konda Surekha) ఈరోజు (శనివారం) మరో లేఖ రాశారు. తనను, కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని అవమానకర వ్యాఖ్యలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అవమానకర వ్యాఖ్యల వెనుక ఉన్న అసలు వ్యక్తులను గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. వెనుక ఉండి వ్యవహారాన్ని నడిపిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.


క్రమశిక్షణా కమిటీ నోటీసుకు ఇప్పటికే వివరణ ఇచ్చానని మంత్రి కొండా సురేఖ తెలిపారు. విచారణ కొనసాగుతుండగానే తనపై బహిరంగ విమర్శలు చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. తన రాజకీయ భవిష్యత్తుపై తీర్పులు ఇవ్వడం, చర్యలు కోరడం వెనుక ఉద్దేశాలను పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. క్రమశిక్షణా కమిటీ స్వతంత్ర నిర్ణయాన్ని ప్రభావితం చేసే ప్రయత్నం జరిగిందా? పరిశీలించాలని సురేఖ కోరారు.


సీనియర్ బీసీ మహిళా నాయకురాలిపై సామూహిక దాడులు జరుగుతున్నా పార్టీ మౌనం వహించడం ఆందోళనకరమని మంత్రి సురేఖ వ్యాఖ్యానించారు. పార్టీ ప్రజాస్వామ్య విలువలు, సామాజిక న్యాయం, మహిళా సాధికారతకు విరుద్ధంగా వ్యవహరించేవారిపై చర్యలు తీసుకోవాలని మంత్రి కొండా సురేఖ డిమాండ్ చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి...

హరీశ్‌రావు కాదు.. అబద్దాల రావు.. మంత్రి పొంగులేటి సెటైర్లు

ఆ భూములను లాక్కుంటే.. చూస్తూ ఊరుకోం.. రేవంత్‌ సర్కార్‌కు కవిత వార్నింగ్

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Aug 22 , 2026 | 09:18 PM