లండన్‌లో సీఎం రేవంత్‌రెడ్డితో లివర్‌పూల్ ప్రతినిధుల భేటీ
ABN , Publish Date - Aug 22 , 2026 | 02:08 PM
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి లండన్‌లో పర్యటిస్తున్నారు. లండన్‌లో పలువురు ప్రతినిధులతో సీఎం భేటీ అవుతున్నారు. ఈ మేరకు తెలంగాణ అభివృద్ధిపై చర్చిస్తున్నారు. శనివారం లండన్‌లో సీఎం రేవంత్‌రెడ్డితో లివర్‌పూల్ సిటీ డెవలప్‌మెంట్, ఫుట్‌బాల్ క్లబ్ ప్రతినిధులతో సమావేశం అయ్యారు.
హైదరాబాద్, ఆగస్టు 22 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Telangana CM Revanth Reddy) లండన్‌లో పర్యటిస్తున్నారు. లండన్‌లో పలువురు ప్రతినిధులతో సీఎం భేటీ అవుతున్నారు. ఈ మేరకు తెలంగాణ అభివృద్ధిపై చర్చిస్తున్నారు. ఈరోజు (శనివారం) లండన్‌లో సీఎం రేవంత్‌రెడ్డితో లివర్‌పూల్ సిటీ డెవలప్‌మెంట్, ఫుట్‌బాల్ క్లబ్ ప్రతినిధులు సమావేశం అయ్యారు. ఈ భేటీలో పలు కీలక అంశాలపై సీఎంతో లివర్‌పూల్ ప్రతినిధులు చర్చించారు. తెలంగాణతో వ్యూహాత్మక భాగస్వామ్యానికి లివర్‌పూల్ ప్రతినిధులు ఆసక్తి చూపిస్తున్నారు. లైఫ్ సైన్సెస్, టెక్నాలజీ, క్రీడలు, క్రియేటివ్ ఎకానమీపై భాగస్వామ్యం చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్‌కు లివర్‌పూల్ ప్రతినిధుల బృందం అక్టోబర్‌లో రానుంది. హైదరాబాద్ పర్యటనలో లివర్‌పూల్ భాగస్వామ్యంపై అధికారిక ఒప్పందానికి సన్నాహాలు చేస్తున్నారు.
లండన్ ఇంపీరియల్ కాలేజీతో తెలంగాణ భాగస్వామ్యంపై చర్చలు: సీఎం సలహాదారు రామకృష్ణారావు
లండన్ ఇంపీరియల్ కాలేజీతో తెలంగాణ భాగస్వామ్యంపై చర్చలు జరిగాయని సీఎం సలహాదారు కె. రామకృష్ణారావు తెలిపారు. ఇంపీరియల్ కాలేజీని సందర్శించామని అన్నారు. ఆ కాలేజీ ప్రతినిధులతో విద్యా సహకార అవకాశాలపై ఈ సమావేశంలో చర్చించామని వెల్లడించారు. తెలంగాణలో షార్ట్‌టర్మ్, ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ కోర్సులపై పరిశీలిస్తున్నామని అన్నారు. పరిశోధన, విద్యార్థులు - అధ్యాపకుల మార్పిడిపై ఇంపీరియల్ ఆసక్తి చూపిస్తోందని వివరించారు.
ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌కు ఇంపీరియల్ ప్రతినిధులకు ఆహ్వానించామని రామకృష్ణారావు చెప్పారు. డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో హైదరాబాద్‌లో ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ జరుగుతుందని తెలిపారు. STEM, బిజినెస్ విద్యలో ప్రపంచ ప్రఖ్యాత సంస్థగా ఇంపీరియల్ కాలేజ్‌కి పేరొందని వెల్లడించారు. అంతర్జాతీయ విద్యా కేంద్రంగా తెలంగాణ అభివృద్ధికి భాగస్వామ్య చర్చలు జరిగాయని వివరించారు. హైదరాబాద్‌లో అంతర్జాతీయ విద్యా కార్యక్రమాలకు కొత్త అవకాశాలు కల్పిస్తున్నట్లు రామకృష్ణారావు పేర్కొన్నారు.
వార్తలు కూడా చదవండి...
హరీశ్‌రావు కాదు.. అబద్దాల రావు.. మంత్రి పొంగులేటి సెటైర్లు
ఆ భూములను లాక్కుంటే.. చూస్తూ ఊరుకోం.. రేవంత్ సర్కార్‌కు కవిత వార్నింగ్
Read Latest AP News And Telangana News And National News
And Telugu News