డీసీహెచ్‌ఎస్‌లు విధులకు గైర్హాజరైతే కఠిన చర్యలు: మంత్రి దామోదర్
ABN , Publish Date - Aug 22 , 2026 | 06:56 PM
ఆయా కమ్యూనిటీ, ఏరియా, జిల్లా ఆస్పత్రులను పూర్తిస్థాయి వైద్య కేంద్రాలుగా అభివృద్ధి చేస్తామని తెలంగాణ మంత్రి దామోదర్ రాజనర్సింహ వ్యాఖ్యానించారు. జిల్లా, ఏరియా ఆస్పత్రుల్లోనూ మేజర్ సర్జరీలు అందుబాటులోకి తీసుకువచ్చామని పేర్కొన్నారు.
హైదరాబాద్, ఆగస్టు 22 (ఆంధ్రజ్యోతి): ఆయా కమ్యూనిటీ, ఏరియా, జిల్లా ఆస్పత్రులను పూర్తిస్థాయి వైద్య కేంద్రాలుగా అభివృద్ధి చేస్తామని తెలంగాణ మంత్రి దామోదర్ రాజనర్సింహ (Minister Damodar Rajanarsimha) వ్యాఖ్యానించారు. జిల్లా, ఏరియా ఆస్పత్రుల్లోనూ మేజర్ సర్జరీలు అందుబాటులోకి తీసుకువచ్చామని పేర్కొన్నారు. ఈరోజు (శనివారం) సచివాలయంలో మీడియాతో మంత్రి దామోదర్ మాట్లాడారు. టీచింగ్ హాస్పిటళ్లలో 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేస్తామని తెలిపారు. జిల్లా, ఏరియా ఆస్పత్రులు, CHCల్లో 1,616 మంది స్పెషలిస్ట్ డాక్టర్లను నియమిస్తామని చెప్పారు. చిన్న సమస్యలకే పెద్ద ఆస్పత్రులకు రిఫర్ చేయొద్దని ఆదేశించారు.
అవసరమైతేనే పేషెంట్లను పై స్థాయి ఆస్పత్రులకు రిఫర్ చేయాలని మంత్రి దామోదర్ రాజనర్సింహ సూచించారు. అత్యవసర రిఫరల్‌కు ముందు సంబంధిత ఆస్పత్రికి సమాచారం ఇవ్వాలని సలహా ఇచ్చారు. అవసరమున్న ఆస్పత్రుల్లో కొత్త సీటీ స్కాన్లు, వైద్య పరికరాలను అందుబాటులో ఉంచుతామని అన్నారు. పరికరాల ప్రతిపాదనలకు రోగుల సంఖ్య, అవసరంపై జస్టిఫికేషన్ తప్పనిసరని చెప్పారు.
డీసీహెచ్‌ఎస్‌లు వారానికి కనీసం ఒకరోజు ఆకస్మిక తనిఖీలు చేయాలని మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశించారు. డీసీహెచ్‌ఎస్‌లు విధులకు గైర్హాజరు, విధుల నుంచి ముందే వెళ్లిపోతే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఆయా ఆస్పత్రుల్లో సమస్యలను ముందుగానే గుర్తించి పరిష్కరించాలని అన్నారు. పరిశుభ్రత, తాగునీరు, బయోమెడికల్ వేస్ట్‌పై ప్రత్యేక దృష్టి సారించామని తెలిపారు. ప్రతి నెలా డీసీహెచ్‌ఎస్‌ల వర్క్ రిపోర్ట్ ప్రభుత్వానికి సమర్పించాలని మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశించారు.
వార్తలు కూడా చదవండి...
హరీశ్‌రావు కాదు.. అబద్దాల రావు.. మంత్రి పొంగులేటి సెటైర్లు
ఆ భూములను లాక్కుంటే.. చూస్తూ ఊరుకోం.. రేవంత్ సర్కార్‌కు కవిత వార్నింగ్
Read Latest AP News And Telangana News And National News
And Telugu News