గుడ్ న్యూస్.. నామినేటెడ్ పదవుల భర్తీపై మహేశ్ గౌడ్ కీలక ప్రకటన
ABN , Publish Date - Aug 23 , 2026 | 12:57 PM
నామినేటెడ్ పదవుల భర్తీపై టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ కీలక ప్రకటన చేశారు. సెప్టెంబర్‌లో నామినేటెడ్ పదవుల భర్తీ చేస్తామని స్పష్టం చేశారు. 70 నుంచి 80 శాతం పదవులు పాత కార్యకర్తలకే ఇస్తామని మాటిచ్చారు.
నిజామాబాద్ జిల్లా, ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి): నామినేటెడ్ పదవుల భర్తీపై టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) కీలక ప్రకటన చేశారు. సెప్టెంబర్‌లో నామినేటెడ్ పదవుల భర్తీ చేస్తామని స్పష్టం చేశారు. 70 నుంచి 80 శాతం పదవులు పాత కార్యకర్తలకే ఇస్తామని మాటిచ్చారు. వచ్చే ఎన్నికల్లో 100 సీట్లతో మళ్లీ అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈరోజు (ఆదివారం) నిజామాబాద్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ ముఖ్య నేతలు, కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా మహేశ్ గౌడ్ , ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి పాల్గొన్నారు. పలు కీలక అంశాలపై మహేశ్ గౌడ్ కాంగ్రెస్ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.
20 శాతం పదవులు కొత్త వారికి ఇస్తాం..
20 శాతం పదవులు కొత్త వారికి ఇస్తామని మహేశ్ గౌడ్ తెలిపారు. పార్టీకి కొత్త రక్తం కూడా అవసరమని వెల్లడించారు. పదవుల భర్తీలో గతంలో కొన్ని తప్పిదాలు జరిగాయని చెప్పారు. ఇక నుంచి భర్తీ చేసే పదవుల్లో కమిట్‌మెంట్ ఉన్న కార్యకర్తలకు ప్రాధాన్యం ఇస్తామని భరోసా కల్పించారు. సంక్షేమం, అభివృద్ధిలో ఏ రాష్ట్రం తెలంగాణకు పోటీలో లేదని అన్నారు. ప్రభుత్వంపై ప్రజల్లో సానుకూలత ఉందని చెప్పారు. కార్యకర్తల కష్టం వల్లే అధికారంలోకి వచ్చామని అన్నారు. దోచుకోవడం, దాచుకోవడం బీఆర్ఎస్ నైజమని విమర్శించారు. కాంగ్రెస్ శ్రేణులు ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని మహేశ్ కుమార్ గౌడ్ దిశానిర్దేశం చేశారు.
వార్తలు కూడా చదవండి...
లండన్‌లో సీఎం రేవంత్‌రెడ్డితో లివర్‌పూల్ ప్రతినిధుల భేటీ
డీసీహెచ్‌ఎస్‌లు విధులకు గైర్హాజరైతే కఠిన చర్యలు: మంత్రి దామోదర్
ఆ వ్యాఖ్యల వెనుక ఉన్న అసలు వ్యక్తులను గుర్తించాలి: కొండా సురేఖ
Read Latest Telangana News And AP News And National News
And Telugu News