'టాక్సిక్' సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ ప్రమాదం.. మల్లారెడ్డి కాలేజీపై కేసు నమోదు
ABN , Publish Date - Aug 23 , 2026 | 01:38 PM
ప్రముఖ నటుడు రాకింగ్ స్టార్ యశ్ 'టాక్సిక్' సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ మైసమ్మగూడలోని మల్లారెడ్డి యూనివర్సిటీలో జరిగింది. ఈ ఈవెంట్‌లో ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే.
హైదరాబాద్, ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ నటుడు రాకింగ్ స్టార్ యశ్ 'టాక్సిక్' సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ మైసమ్మగూడలోని మల్లారెడ్డి యూనివర్సిటీలో (Malla Reddy College Case) నిన్న (శనివారం) జరిగింది. ఈ ఈవెంట్‌లో ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమం మధ్యలో ఒక్కసారిగా భారీ ఫ్లడ్ లైట్ స్థంభం కిందపడిపోయింది. స్థంభం పై పడటంతో ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందగానే ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని వివరాలు సేకరించారు. గాయపడిన వారిని హుటాహుటిన సమీప ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు.
ఈ ఘటనకు కారణమైన మల్లారెడ్డి కాలేజీపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మల్లారెడ్డి కళాశాలలో టాక్సిక్ వ్యవహారానికి సంబంధించి ఈ కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ కార్యక్రమంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని మల్లారెడ్డి కాలేజీపై కేసు నమోదు చేశామని వెల్లడించారు. ఈ ఈవెంట్‌లో తొక్కిసలాట జరగటంతో పలువురికి గాయాలయ్యాయని చెప్పారు. టాక్సిక్ చిత్ర యూనిట్‌పై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు.
వార్తలు కూడా చదవండి...
లండన్‌లో సీఎం రేవంత్‌రెడ్డితో లివర్‌పూల్ ప్రతినిధుల భేటీ
డీసీహెచ్‌ఎస్‌లు విధులకు గైర్హాజరైతే కఠిన చర్యలు: మంత్రి దామోదర్
ఆ వ్యాఖ్యల వెనుక ఉన్న అసలు వ్యక్తులను గుర్తించాలి: కొండా సురేఖ
Read Latest Telangana News And AP News And National News
And Telugu News