Share News

మంత్రి కొండా సురేఖ వ్యవహారంపై నివేదిక సిద్ధం చేసిన క్రమశిక్షణ కమిటీ

ABN , Publish Date - Aug 24 , 2026 | 12:02 PM

తెలంగాణ మంత్రి కొండా సురేఖ వ్యవహారంపై కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ నివేదిక సిద్ధం చేసింది. ఈ నివేదికను తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జీ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్‌కు ఈ కమిటీ ఇవ్వనుంది.

మంత్రి కొండా సురేఖ వ్యవహారంపై నివేదిక సిద్ధం చేసిన క్రమశిక్షణ కమిటీ
Konda Surekha

హైదరాబాద్, ఆగస్టు 24 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ మంత్రి కొండా సురేఖ (Minister Konda Surekha) వ్యవహారంపై కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ నివేదిక సిద్ధం చేసింది. ఈ నివేదికను తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జీ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్‌కు ఈ కమిటీ ఇవ్వనుంది. ఈ క్రమంలోనే కొండా సురేఖపై చర్యలకు రంగం సిద్ధమైనట్లు సమాచారం.


కొండా సురేఖతో పాటు మరో ఇద్దరి వ్యవహారంపై కఠిన నిర్ణయం తీసుకునేలా క్రమశిక్షణ కమిటీ సిఫారసు చేసినట్లు తెలుస్తోంది. ఈరోజు (సోమవారం) సాయంత్రం ఈ నివేదికను ఏఐసీసీకి మహేశ్ గౌడ్ పంపనున్నారు. ఆమె వివరణకు క్రమశిక్షణ కమిటీ సంతృప్తి వ్యక్తం చేయలేదని సమాచారం.


కొండా సురేఖపై చర్యలు తీసుకోవాలని క్రమశిక్షణ కమిటీ సిఫారసు చేసింది. సీఎం రేవంత్‌రెడ్డిపై ఆమె కూతురు సుస్మిత ఆరోపణలు చేస్తే సహజ న్యాయ సూత్రం ప్రకారం సురేఖ ఖండించాల్సి ఉందని.. కానీ అలా చేయలేదని ఈ కమిటీ అభిప్రాయపడింది. సీఎం రేవంత్‌రెడ్డి, ప్రభుత్వం, పార్టీపై ఎవరు తప్పుడు మాటలు మాట్లాడినా తప్పనిసరిగా చర్యలు ఉండాల్సిందేనని ఈ కమిటీ స్పష్టం చేసింది. గతంలో కొండా సురేఖను కాపాడానని, ఇక తానేమీ చేయలేనని మహేశ్ గౌడ్ ఇటీవల స్పష్టం చేసిన విషయం తెలిసిందే.


సీఎం రేవంత్‌రెడ్డితో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భేటీ

ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క భేటీ అయ్యారు. రాష్ట్రంలోని తాజా పరిణామాలపై ఇరువురు నేతలు ఈ సమావేశంలో చర్చిస్తున్నారు. ఇటీవల భట్టితో క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి భేటీ అయ్యారు. కొండా సురేఖ అంశంపై సీఎం రేవంత్, భట్టి విక్రమార్క చర్చించనున్నట్లు సమాచారం.


ఈ వార్తలు కూడా చదవండి...

కొండా సురేఖపైన కుట్ర చేయాల్సిన ఎవరికి అవసరం లేదు: మంత్రి శ్రీహరి

గుడ్ న్యూస్.. నామినేటెడ్ పదవుల భర్తీపై మహేశ్ గౌడ్ కీలక ప్రకటన

'టాక్సిక్' సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ ప్రమాదం.. మల్లారెడ్డి కాలేజీపై కేసు నమోదు

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Aug 24 , 2026 | 12:20 PM