చికెన్ వ్యర్థాలపై అధికారుల చర్యలు.. 100 టన్నుల స్వాధీనం
ABN , Publish Date - Aug 24 , 2026 | 11:08 AM
హైదరాబాద్‌లో చికెన్ వ్యర్థాల మాఫియాపై సైబరాబాద్ పోలీసులు, వెటర్నరీ అధికారులు సోమవారం సోదాలు చేశారు.
హైదరాబాద్, ఆగస్టు 24 (ఆంధ్రజ్యోతి): చికెన్ వ్యర్థాల మాఫియాపై సైబరాబాద్ పోలీసులు, వెటర్నరీ అధికారులు ఈరోజు (సోమవారం) సోదాలు చేశారు. వంద టన్నుల వ్యర్థాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. చేపల చెరువు యజమానులకు చికెన్ వ్యర్థాలను విక్రయించి ఈ మాఫియా సొమ్ము చేసుకుంటున్నట్లు పోలీసులు గుర్తించారు. చికెన్ వ్యర్థాలతో పెరిగే చేపలు తింటే క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉందంటూ అధికారులు హెచ్చరించారు.
అత్తాపూర్, మియాపూర్, అమీన్‌పూర్, కూకట్‌పల్లి, జీడిమెట్ల, చింతల్‌లో లారీల్లో డంప్ చేస్తోండగా అధికారులు తనిఖీలు చేపట్టారు. గతంలో కేసులు నమోదైన కూడా ఈ చికెన్ మాఫియా పట్టించుకోలేదని అధికారులు చెబుతున్నారు. రాత్రి సమయంలో ఏపీలోని చేపల చెరువు యజమానులకు ఈ వ్యర్థాలను విక్రయించి మాఫియా సొమ్ము చేసుకుంటున్నట్లు అధికారులు నిర్ధారించారు. గత నెలలోనే వందటన్నుల చికెన్ వ్యర్థాలను హెచ్ ఫాస్ట్ అధికారులు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా మళ్లీ అదే రీతిలో చికెన్ వ్యర్థాలను తరలిస్తోండటంతో అధికారులు సోదాలు చేసి చర్యలు చేపట్టారు.
ఈ వార్తలు కూడా చదవండి...
కొండా సురేఖపైన కుట్ర చేయాల్సిన ఎవరికి అవసరం లేదు: మంత్రి శ్రీహరి
గుడ్ న్యూస్.. నామినేటెడ్ పదవుల భర్తీపై మహేశ్ గౌడ్ కీలక ప్రకటన
'టాక్సిక్' సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ ప్రమాదం.. మల్లారెడ్డి కాలేజీపై కేసు నమోదు
Read Latest Telangana News And AP News And National News
And Telugu News