జనగణన పద్ధతిపై రాహుల్, ఖర్గే నిరసన.. ప్రధాని మోదీకి సుదీర్ఘ లేఖ
ABN , Publish Date - Aug 25 , 2026 | 12:58 PM
జనగణన పద్ధతిపై కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీకి మంగళవారం ఖర్గే, రాహుల్ సుదీర్ఘ లేఖ రాశారు.
ఢిల్లీ, ఆగస్టు 25 (ఆంధ్రజ్యోతి): జనగణన పద్ధతిపై కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఈరోజు (మంగళవారం) ఖర్గే, రాహుల్ సుదీర్ఘ లేఖ రాశారు. ఈ లేఖలో పలు అంశాలను ప్రస్తావించారు. కులగణలో తెలంగాణ మోడల్‌ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. జనగణనలో కులాల నమోదుకు ‘ఓపెన్-ఎండెడ్’ విధానాన్ని అమలు చేయడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కులాల లెక్కింపు విధానాలతో తీవ్ర నష్టం జరుగుతోందని రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే ఆందోళన వ్యక్తం చేశారు. ‘ఒకే కులం వేర్వేరు పేర్లతో విడిపోయి లక్షలాది కులాల పేర్లుగా నమోదవుతాయని.. దీనివల్ల లెక్కింపు డేటా పూర్తిగా నిరుపయోగంగా మారుతుందని తెలిపారు. ప్రశ్నావళిలో 'వెనుకబడిన వర్గాలు' (OBC) అనే పదమే లేకపోవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఎస్సీ, ఎస్టీ తరహాలోనే బీసీ, ఓబీసీ కులాల నమోదుకూ 'డ్రాప్-డౌన్ జాబితా' (Drop-down List) విధానాన్ని ఉపయోగించాలని రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే సూచించారు. తెలంగాణ (2024), బిహార్ (2022) సర్వేల్లో వాడిన కులాల జాబితా నమూనాలను ప్రధానికి పంపించారు. ప్రస్తుత గందరగోళ ప్రశ్నావళిని వెంటనే రద్దు చేసి, అన్ని పార్టీలు - నిపుణులతో చర్చించి ఓ కొత్త ప్రశ్నావళిని రూపొందించాలని ఖర్గే, రాహుల్ డిమాండ్ చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి...
మంత్రి కొండా సురేఖ వ్యవహారంపై నివేదిక సిద్ధం చేసిన క్రమశిక్షణ కమిటీ
సీఎంసీ ఫిర్యాదుతో హైడ్రా యాక్షన్.. ప్రమాదకర భవనం తొలగింపు
చికెన్ వ్యర్థాలపై అధికారుల చర్యలు.. 100 టన్నుల స్వాధీనం
Read Latest Telangana News And AP News And National News
And Telugu News