ఆస్ట్రేలియా క్రికెట్‌లో అనయా బంగర్
ABN , Publish Date - Aug 26 , 2026 | 04:03 AM
మాజీ క్రికెటర్ సంజయ్ బంగర్ కూతురు అనయా బంగర్‌కు ఆస్ర్టేలియా మహిళల కమ్యూనిటీ క్రికెట్‌లో ఆడేందుకు అనుమతి లభించింది...
న్యూఢిల్లీ: మాజీ క్రికెటర్ సంజయ్ బంగర్ కూతురు అనయా బంగర్‌కు ఆస్ర్టేలియా మహిళల కమ్యూనిటీ క్రికెట్‌లో ఆడేందుకు అనుమతి లభించింది. ఈ నిర్ణయంపై అనయా సంతోషం వ్యక్తం చేసింది. అబ్బాయి నుంచి అమ్మాయిగా మారిన తను ఇక క్రికెట్ ఆడలేనేమోనని భావించానని తెలిపింది. కానీ క్రికెట్ ఆస్ట్రేలియా మరో అవకాశం ఇచ్చిందని కృతజ్ఞతలు తెలిపింది. వచ్చే ఏడాది మార్చి వరకు ఆసీ్‌సలోని ఏ రాష్ట్రంలోనైనా ప్రీమియర్ క్రికెట్ పోటీల్లో పాల్గొనేందుకు ఆమెకు అవకాశం ఉంటుందని సీఏ పేర్కొంది. అంతకన్నా ముందు అనయా బ్లడ్ టెస్టులో టెస్టోస్టిరాన్ స్థాయి ప్రమాణాలకు తగ్గట్టుగా ఉందో లేదో పరిశీలిస్తారు.
ఈ వార్తలనూ చదవండి:
ఏడేళ్ల తర్వాత భారత్‌కు జిన్‌పింగ్.. బ్రిక్స్ సదస్సుకు 400 మందితో భారీ బృందం..
ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీకి సంబంధించిన అరుదైన వీడియో విడుదల!