ఇరాన్‌కు ఆంక్షల ఉచ్చు!
ABN , Publish Date - Aug 26 , 2026 | 07:10 AM
ఇరాన్‌పై ఒత్తిడిని మరింత పెంచేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆంక్షల బాటపట్టారు. ఇరాన్ ఆర్థిక వ్యవస్థను కుంగదీయడం లక్ష్యంగా ‘ఆపరేషన్ ఎకానమిక్ ఔట్‌క్యాస్ట్’ పేరిట...
ఆర్థికంగా కుంగదీసేందుకు కఠిన చర్యలకు దిగిన అమెరికా
4 భారత సంస్థలు సహా ఇరాన్‌తో వ్యాపారం చేసే 60కిపైగా సంస్థలపై ఆంక్షలు.. ఖండించిన చైనా
వాషింగ్టన్/దుబాయ్/న్యూఢిల్లీ, ఆగస్టు 25: ఇరాన్‌పై ఒత్తిడిని మరింత పెంచేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆంక్షల బాటపట్టారు. ఇరాన్ ఆర్థిక వ్యవస్థను కుంగదీయడం లక్ష్యంగా ‘ఆపరేషన్ ఎకానమిక్ ఔట్‌క్యాస్ట్’ పేరిట ఆర్థిక ఆంక్షలు విధించారు. ఇరాన్‌తో వ్యాపారం చేసే నాలుగు భారతీయ సంస్థలు సహా 60కిపైగా సంస్థలు/వ్యక్తులపై నియంత్రణలు విధించారు. ఈ వివరాలతో అమెరికా విదేశాంగ శాఖ ప్రకటన విడుదల చేసింది. ఇరాన్ నుంచి చమురు, పెట్రోరసాయనాలను కొనుగోలు చేస్తున్నాయంటూ భారత్‌కు చెందిన పోర్టీస్ పార్ట్‌నర్స్ ఎల్‌ఎల్‌పీ, సదాశివ ఓవర్సీస్ లిమిటెడ్, పీపీ సాఫ్ట్‌టెక్ ప్రైవేట్ లిమిటెడ్, ప్రకృతీస్ ఇన్‌ఫ్రా ఇంపెక్స్ సంస్థలు, వాటి భాగస్వాములు, కొందరు డైరెక్టర్లపైనా ఆంక్షలు విధిస్తున్నట్టు పేర్కొంది. అంతేకాదు ఇరాన్‌తో వాణిజ్యాన్ని నిలిపివేసుకోవాలని, లేకుంటే ఆయా దేశాలపైనా ఆంక్షలు విధిస్తామని అమెరికా విదేశాంగ మంత్రి స్కాట్ బెసెంట్ హెచ్చరించారు. మరోవైపు, అమెరికా ఆంక్షలకు భయపడే ప్రసక్తే లేదని, ఆంక్షలను ఎదుర్కొనేందుకు రెండేళ్ల ప్రణాళికతో సిద్ధంగా ఉన్నామని ఇరాన్ ప్రకటించింది. అమెరికా ఆంక్షలను చైనా ఖండించింది. అవి అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమని స్పష్టం చేసింది. ‘‘చైనా, ఇరాన్ మధ్య సంబంధాలు, సహకారం అంతర్జాతీయ చట్టాలకు లోబడి కొనసాగుతున్నాయి. అందులో మరెవరూ జోక్యం చేసుకోవడం సరికాదు’’ అని చైనా విదేశాంగ శాఖ పేర్కొంది.
ఈ వార్తలనూ చదవండి:
ఏడేళ్ల తర్వాత భారత్‌కు జిన్‌పింగ్.. బ్రిక్స్ సదస్సుకు 400 మందితో భారీ బృందం..
ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీకి సంబంధించిన అరుదైన వీడియో విడుదల!