కాకినాడలో జిమ్ ట్రైనర్ దారుణ హత్య.. కర్రతో గొంతులో పొడిచి..
ABN , Publish Date - Aug 26 , 2026 | 11:14 AM
కాకినాడలోని భానుగుడి సెంటర్‌లో అర్ధరాత్రి యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. అర్ధరాత్రి సుమారు 2 గంటల సమయంలో కోడమాటి సతీష్ రెడ్డి(30) అనే జిమ్ ట్రైనర్‌పై కొందరు వ్యక్తులు దాడి చేయడంతో తీవ్రంగా గాయపడి మృతిచెందాడు.
కాకినాడ, ఆగస్టు 26: కాకినాడలోని భానుగుడి సెంటర్‌లో అర్ధరాత్రి యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. అర్ధరాత్రి సుమారు 2 గంటల సమయంలో కోడమాటి సతీష్ రెడ్డి(30) అనే జిమ్ ట్రైనర్‌పై కొందరు వ్యక్తులు దాడి చేయడంతో తీవ్రంగా గాయపడి మృతిచెందాడు. భానుగుడి సెంటర్‌లో సతీష్ రెడ్డిపై బందుల సాయికిరణ్‌తో పాటు అతని స్నేహితులు దాడికి తెగబడ్డారు. దాడి సమయంలో కర్రతో సతీష్ రెడ్డి గొంతులో పొడిచారు. దీంతో తీవ్ర గాయాలపాలైన ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని ఘటనాస్థలిని పరిశీలించారు. సతీష్ రెడ్డి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. హత్యపై కాకినాడ టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అక్రమ సంబంధం, ఆర్థిక లావాదేవీలే హత్యకు కారణమై ఉండవచ్చనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ ఘటనతో భానుగుడి సెంటర్‌లో ఒక్కసారిగా కలకలం రేగింది.
ఇవి కూడా చదవండి...
ముస్లిం సోదరులకు 'మిలాద్-ఉన్-నబీ' శుభాకాంక్షలు: సీఎం చంద్రబాబు
పొలానికి వెళ్లిన రైతుపై ఒక్కసారిగా ఎలుగుబంటి దాడి.. 40కి పైగా కుట్లు
Read Latest AP News And Telugu News