ముస్లిం సోదరులకు 'మిలాద్-ఉన్-నబీ' శుభాకాంక్షలు: సీఎం చంద్రబాబు
ABN , Publish Date - Aug 26 , 2026 | 09:41 AM
మిలాద్-ఉన్-నబీ సందర్భంగా ముస్లిం సోదరులకు సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ శుభాకాంక్షలు తెలియజేశారు.
అమరావతి, ఆగస్టు 26: మిలాద్-ఉన్-నబీ సందర్భంగా ముస్లిం సోదరులకు సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ శుభాకాంక్షలు తెలియజేశారు. సోషల్ మీడియా ఎక్స్ వేదికగా సీఎం స్పందిస్తూ.. ‘సర్వమానవాళి శ్రేయస్సు కోసం, శాంతిని నెలకొల్పేందుకు కృషిచేసిన కారణజన్ముడు మహమ్మద్ ప్రవక్త. సాటివారి పట్ల ప్రేమ, దయను కలిగి ఉంటూ.. శాంతియుత సమాజాన్ని నెలకొల్పడానికి జీవితకాలం కృషిచేసిన ప్రవక్త జన్మదినాన్ని అత్యంత భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్న ముస్లిం సోదరులకు 'మిలాద్-ఉన్-నబీ' శుభాకాంక్షలు’ అంటూ ఎక్స్‌లో సీఎం చంద్రబాబు పోస్ట్ చేశారు.
ప్రవక్త మానవ సేవా మార్గంలో పయనిద్దాం: లోకేశ్

‘మహమ్మద్ ప్రవక్త జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని జరుపుకునే మిలాద్-ఉన్-నబీ సందర్భంగా ముస్లిం సోదర, సోదరీమణులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రవక్త చూపిన దయ, నిరాడంబరత, మానవ సేవా మార్గంలో పయనిద్దాం’ అంటూ ఎక్స్ వేదికగా మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు.
ప్రవక్త బోధనలు ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం: పల్లా

‘మిలాద్-ఉన్-నబీ’ సందర్భంగా ముస్లిం సోదర, సోదరీ మణులందరికీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రేమ, శాంతి, సౌభ్రాతృత్వం, మానవతా విలువలను ప్రపంచానికి చాటిన మహమ్మద్ ప్రవక్త బోధనలు ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమన్నారు. ఈ పవిత్ర పర్వదినం రాష్ట్రంలో మత సామరస్యం, సోదరభావం, శాంతి మరింత బలోపేతం కావాలని కోరుకున్నారు. ప్రతి కుటుంబంలో సుఖశాంతులు, ఆయురారోగ్యాలు వెల్లివిరియాలని ప్రార్థిస్తున్నట్లు పల్లా శ్రీనివాసరావు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురి మృతి
జగన్ హయాంలో వెలిగొండ నిర్వాసితులను మోసం, దగా చేశారు: మంత్రి నిమ్మల
Read Latest AP News And Telugu News