జగన్ హయాంలో వెలిగొండ నిర్వాసితులను మోసం, దగా చేశారు: మంత్రి నిమ్మల
ABN , Publish Date - Aug 26 , 2026 | 07:57 AM
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ హయాంలోని ఐదేళ్లలో వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులను పచ్చి మోసం, దగా చేశారని ధ్వజమెత్తారు.
మార్కపురం జిల్లా , ఆగస్టు26 (ఆంధ్రజ్యోతి): వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ హయాంలోని ఐదేళ్లలో వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులను పచ్చి మోసం, దగా చేశారని ధ్వజమెత్తారు. నిర్వాసితులకు రూ. 900 కోట్లు ఇవ్వాల్సి ఉన్నా, ఐదేళ్లలో ఒక్క రూపాయి కూడా ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు 40 రోజుల్లోనే రూ.768 కోట్లు ఇచ్చామని వెల్లడించారు. వెలిగొండ ప్రాజెక్ట్ ఫీడర్ కెనాల్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించే రెగ్యులేటర్ గేట్లు అమర్చే పనులను మంత్రి నిమ్మల పరిశీలించారు. ఈనెల 31వ తేదీన సీఎం చంద్రబాబు వెలిగొండ వద్ద జలహారతి ఇచ్చే, ఘాట్, స్థూపం, సభా స్థలం ఏర్పాట్లపై అధికారులకు మంత్రి నిమ్మల దిశా నిర్దేశం చేశారు.
వెలిగొండ నిర్వాసితుల త్యాగం వెలకట్టలేనిది..
నిన్న (మంగళవారం) రాత్రి నిర్వాసితుల కాలనీలను సందర్శించి, మౌలిక వసతుల కల్పనపై కలెక్టర్, అధికారులకు మంత్రి నిమ్మల పలు సూచనలు చేశారు. వెలిగొండ కోసం భూములు, ఆస్తులు త్యాగం చేసిన నిర్వాసితులందరికీ, పేరు పేరునా పాదాభివందనాలు చేస్తున్నామని అన్నారు. 7వేల నిర్వాసితుల కుటుంబాల త్యాగఫలితమే నేడు, లక్షలాది ఎకరాలకు సాగు, లక్షలాది ప్రజలకు తాగునీరు అందబోతుందని చెప్పారు. వెలిగొండ నిర్వాసితుల త్యాగం వెలకట్టలేనిదని కొనియాడారు.
నిర్వాసితులకు అన్ని రకాలుగా అండగా ఉంటాం..
భవిష్యత్తులో నిర్వాసితులకు అన్ని రకాలుగా తమ ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి నిమ్మల మాటిచ్చారు. ప్రతి గ్రీవెన్స్‌ని పరిశీలించి, అర్హులైన ప్రతి ఒక్కరికీ కూడా న్యాయం చేయమని చంద్రబాబు తమకు ఆదేశాలు ఇచ్చారని అన్నారు. నాడు, నేడు నిర్వాసితులకు అండగా ఉంది చంద్రబాబే అని చెప్పుకొచ్చారు. నిర్వాసిత కుటంబాలు సొంత ఇళ్లుకట్టుకుని, గృహప్రవేశాలు చేసే వరకూ అధికారులు, నాయకులు అండగా ఉంటారని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
పైలట్ల డోప్ టెస్టులపై కేంద్రం ఫోకస్.. ఏడాదికి ఒకసారి పరీక్షకు యోచన: రామ్మోహన్
బీసీలను జగన్ రెడ్డి మోసం చేస్తున్నారు.. యనమల ధ్వజం
వన మహోత్సవం లక్ష్యాలను నిర్ణీత గడువులో పూర్తి చేయాలి: మంత్రి సీతక్క
Read Latest Telangana News And AP News And National News
And Telugu News