పశ్చిమగోదావరి జిల్లాలో బోటు ప్రమాదం..
ABN , Publish Date - Aug 26 , 2026 | 06:42 AM
పశ్చిమగోదావరి జిల్లాలో బోటు ప్రమాదానికి గురైంది. నర్సాపురం మండలం చిన్నలంక వద్ద ఇసుక దిబ్బను ఢీకొని బోటు బోల్తా పడింది.
పశ్చిమగోదావరి జిల్లా, ఆగస్టు26 (ఆంధ్రజ్యోతి): పశ్చిమగోదావరి జిల్లాలో బోటు ప్రమాదానికి గురైంది. నర్సాపురం మండలం చిన్నలంక వద్ద ఇసుక దిబ్బను ఢీకొని బోటు బోల్తా పడింది. ప్రమాద సమయంలో బోటులో ఉన్న ఏడుగురు మత్స్యకారులు సముద్రంలో పడిపోయారు. ప్రాణాలను కాపాడుకునేందుకు మత్స్యకారులు ఈదుకుంటూ ఒడ్డుకు చేరేందుకు ప్రయత్నించారు.
ఈ క్రమంలో మత్స్యకారుల ఆర్తనాదాలు విన్న చిన్నలంక గ్రామస్తులు వెంటనే స్పందించారు. సముద్రంలో చిక్కుకున్న వారిని గుర్తించి రక్షణ చర్యలు చేపట్టారు. గ్రామస్తుల అప్రమత్తతతో ఏడుగురు మత్స్యకారులు ప్రాణాలతో సురక్షితంగా బయటపడ్డారు. అనంతరం పోలీసులు వారిని చిన్నలంక గ్రామంలోని పునరావాస కేంద్రానికి తరలించారు.
ఈ ప్రమాదానికి గురైన బోటులో ఉన్న మత్స్యకారులంతా కాకినాడకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. సుమారు ఏడు రోజుల క్రితం కాకినాడ నుంచి ఈ బోటు బయలుదేరింది. చేపల వేట కోసం సముద్రంలోకి వెళ్లిన సమయంలో నర్సాపురం మండలం చిన్నలంక సమీపంలో ఇసుక దిబ్బను బోటు ఢీకొంది. దీంతో బోటు ఒక్కసారిగా బోల్తా పడటంతో మత్స్యకారులు నీటిలో పడిపోయారు.
అయితే ప్రమాద సమయంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అధికారులు, స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు. గ్రామస్థులు సకాలంలో స్పందించి మత్స్యకారులను రక్షించడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రస్తుతం ఏడుగురు మత్స్యకారులు సురక్షితంగా ఉన్నారని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదానికి గల పూర్తి కారణాలపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
ఈ వార్తలు కూడా చదవండి...
పైలట్ల డోప్ టెస్టులపై కేంద్రం ఫోకస్.. ఏడాదికి ఒకసారి పరీక్షకు యోచన: రామ్మోహన్
బీసీలను జగన్ రెడ్డి మోసం చేస్తున్నారు.. యనమల ధ్వజం
వన మహోత్సవం లక్ష్యాలను నిర్ణీత గడువులో పూర్తి చేయాలి: మంత్రి సీతక్క
Read Latest Telangana News And AP News And National News
And Telugu News