సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురి మృతి
ABN , Publish Date - Aug 26 , 2026 | 06:15 AM
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కోదాడ మండలం దొరకుంట శివారులో బుధవారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనలో ఆరుగురు మృతిచెందారు.
సూర్యాపేట జిల్లా, ఆగస్టు26 (ఆంధ్రజ్యోతి): సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కోదాడ మండలం దొరకుంట శివారులో ఈరోజు (బుధవారం) తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనలో ఆరుగురు మృతిచెందారు. మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉండగా.. మరో11 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో ఐదుగురు మహిళలు, ఒక పురుషుడు ఉన్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మొత్తం 42 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ బస్సు హైదరాబాద్ నుంచి ఏలూరుకు బయలుదేరగా.. దొరకుంట దగ్గర ముందు వెళ్తున్న కంటైనర్ డీసీఎంను వెనుక నుంచి బలంగా ఢీకొనడంతో ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు.
మృతుల వివరాలివే..
1.లొల్లి పోగు మేరీ జ్యోత్స్న (39), విజయవాడ
2. భావన(25), విజయవాడ.
3. పిడికిటి లక్ష్మీ(31), విజయవాడ.
4. యాసారపు చిన్ని(31) ఎన్టీఆర్ జిల్లా, తెల్లప్రోలు
5. షకీనా (24), భీమవరం
6. చెన్న కేశవుల నాగేంద్రబాబు(31), పడమట పల్లి, కృష్ణా జిల్లా

ఈ ప్రమాదంతో ప్రయాణికులు, స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈ ఘటనపై పోలీసులకు స్థానికులు సమాచారం అందజేశారు. పోలీసులు హుటాహుటినా సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదం కారణంగా హైదరాబాద్ – విజయవాడ మార్గంలో కొంతసేపు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
ఈ ప్రమాదానికి బస్సు డ్రైవర్ నిర్లక్ష్యమా, అతివేగమా, లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అన్నది పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కంటైనర్ డీసీఎంను ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు వెనుక నుంచి బలంగా ఢీకొనడంతోనే ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ వార్తలు కూడా చదవండి...
పైలట్ల డోప్ టెస్టులపై కేంద్రం ఫోకస్.. ఏడాదికి ఒకసారి పరీక్షకు యోచన: రామ్మోహన్
బీసీలను జగన్ రెడ్డి మోసం చేస్తున్నారు.. యనమల ధ్వజం
వన మహోత్సవం లక్ష్యాలను నిర్ణీత గడువులో పూర్తి చేయాలి: మంత్రి సీతక్క
Read Latest Telangana News And AP News And National News
And Telugu News