Share News

ప్రతి చేనేత కార్మికుడికీ ‘నేతన్నల సేవలో పథకం’: మంత్రి సవిత

ABN , Publish Date - Aug 26 , 2026 | 12:08 PM

మగ్గం నేసే ప్రతి నేతన్నకూ నేతన్నల సేవలో పథకం అందజేస్తామని మంత్రి సవిత స్పష్టం చేశారు. మొదటి విడతలో 71,536 మంది నేతన్నలకు రూ.25 వేల ఆర్థిక సాయం అందించామని తెలిపారు.

ప్రతి చేనేత కార్మికుడికీ ‘నేతన్నల సేవలో పథకం’: మంత్రి సవిత
Minister Savitha

శ్రీసత్యసాయి జిల్లా, ఆగస్టు 26: మగ్గం నేసే ప్రతి నేతన్నకూ ‘నేతన్నల సేవలో’ పథకం అందజేస్తామని మంత్రి సవిత స్పష్టం చేశారు. ఈరోజు(బుధవారం) మీడియాతో మాట్లాడుతూ.. మొదటి విడతలో 71,536 మంది నేతన్నలకు రూ.25 వేల ఆర్థిక సాయం అందించామని తెలిపారు. రెండో విడతగా త్వరలోనే అర్హులకు ఆర్థికసాయం అందిస్తామన్నారు. కొత్తగా 36,617 దరఖాస్తులు వచ్చినట్లు పేర్కొన్నారు. ఈ నెలాఖరు వరకూ ఇంటింటికీ వెళ్లి లబ్ధిదారులను గుర్తిస్తామని..ఆ వెంటనే లబ్ధిదారుల ఖాతాల్లో నేతన్నల సేవలో నిధులను జమ చేయనున్నట్లు తెలిపారు.


అర్హులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. చేనేతల వెంటే కూటమి ప్రభుత్వం ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు. ఎన్నికల్లో హామీ ఇవ్వకున్నా నేతన్నల సేవలో పథకాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. 365 రోజులూ నేతన్నలకు ఆర్థిక భరోసా కల్పించాలన్నదే సీఎం చంద్రబాబు ధ్యేయమని చెప్పారు. నేతన్నల సేవలో పథకంపై గొడ్డలి పార్టీ అపోహలు సృష్టిస్తోందని మండిపడ్డారు. వైసీపీ ట్రాప్‌లో నేతన్నలు పడొద్దని మంత్రి సవిత కోరారు.


ఇవి కూడా చదవండి...

మదర్ థెరిసా నిస్వార్థ సేవలను మననం చేసుకుందాం: సీఎం చంద్రబాబు

సనాతన ధర్మాన్ని నాశనం చేయాలని చూస్తే ఊరుకోం: భాను ప్రకాశ్ రెడ్డి

Read Latest AP News And Telugu News

Updated Date - Aug 26 , 2026 | 12:31 PM