భారత్-శ్రీలంక రెండో టెస్టు: నాలుగో రోజు ముగిసిన ఆట
ABN , Publish Date - Aug 26 , 2026 | 05:15 PM
కొలంబో వేదికగా భారత్-శ్రీలంక మధ్య జరుగుతున్న రెండో టెస్టు నాలుగో రోజు ఆట ముగిసింది. వర్షం అంతరాయం కలిగించడంతో ముందే ఆటను నిలిపేయాల్సి వచ్చింది.
ఇంటర్నెట్ డెస్క్: కొలంబో వేదికగా భారత్-శ్రీలంక మధ్య జరుగుతున్న రెండో టెస్టు నాలుగో రోజు ఆట ముగిసింది. వర్షం అంతరాయం కలిగించడంతో ముందే ఆటను నిలిపేయాల్సి వచ్చింది. మైదానాన్ని కవర్లతో కప్పి ఉంచారు. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఫాలో ఆన్‌లో శ్రీలంక స్కోర్ 229/6. క్రీజులో కేషారా నువాంత(3*), సోనాల్ దినుశా(7*) కొనసాగుతున్నారు. భారత్ కంటే శ్రీలంక 16 పరుగుల ఆధిక్యంలో ఉంది.
ఓవర్‌నైట్ 265/8 స్కోరుతో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన శ్రీలంక.. మరో 25 పరుగులు జోడించి 290 పరుగులకు ఆలౌటైంది. దీంతో లంకతో భారత్ ఫాలో ఆన్ ఆడించింది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 503/9 వద్ద డిక్లేర్ చేసిన సంగతి తెలిసిందే. భారత బౌలర్లలో మానవ్ సుతార్ 2, ప్రసిద్ధ్ కృష్ణ, సిరాజ్, సారాంశ్ జైన్, జడేజా తలొక వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్‌లో భారత్ విజయావకాశాలు వాతావరణంపై ఆధారపడి ఉన్నాయి. గురువారం వరుణుడు కరుణించి ఆటకు అంతరాయం కలిగించకపోతే టీమిండియా విజయం సాధించడం ఖాయమే.
ఇవి కూడా చదవండి:
కుర్రాళ్ల భవిష్యత్తుకే మంచిది కాదు.. ఐసీసీ, బీసీసీఐ చర్యలు తీసుకోవాలి: సంజయ్ మంజ్రేకర్
ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్: అగ్రస్థానంలో స్టార్క్.. రెండో స్థానానికి పడిపోయిన బుమ్రా