Share News

పంత్ మాస్టర్ ప్లాన్.. శ్రీలంక బ్యాటర్‌ను బోల్తా కొట్టించిన మానవ్ సుతార్!

ABN , Publish Date - Aug 26 , 2026 | 05:00 PM

రెండో టెస్టులో టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్, స్పిన్నర్ మానవ్ సుతార్ కలిసి వేసిన మాస్టర్ ‌ప్లాన్ చక్కగా వర్కౌట్ అయింది. శ్రీలంక బ్యాటర్ పసిందు సూర్యబండారాను అద్భుతంగా స్టంపౌట్ చేసి భారత్‌కు కీలక వికెట్ అందించారు.

పంత్ మాస్టర్ ప్లాన్.. శ్రీలంక బ్యాటర్‌ను బోల్తా కొట్టించిన మానవ్ సుతార్!
Rishabh Pant

ఇంటర్నెట్ డెస్క్: కొలంబో వేదికగా భారత్-శ్రీలంక మధ్య జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్, స్పిన్నర్ మానవ్ సుతార్ కలిసి వేసిన మాస్టర్ ‌ప్లాన్ చక్కగా వర్కౌట్ అయింది. శ్రీలంక బ్యాటర్ పసిందు సూర్యబండారాను అద్భుతంగా స్టంపౌట్ చేసి భారత్‌కు కీలక వికెట్ అందించారు. దీంతో 92 పరుగుల వద్ద పసిందు పెవిలియన్ చేరాల్సి వచ్చింది.


నాలుగో రోజు శ్రీలంక రెండో ఇన్నింగ్స్‌లో 61వ ఓవర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. సుతార్ బౌలింగ్‌లో భారీ షాట్ ఆడేందుకు సూర్యబండారా క్రీజు దాటి ముందుకు వచ్చేందుకు ప్రయత్నించాడు. అయితే బ్యాటర్ ఉద్దేశాన్ని ముందే పసిగట్టిన సుతార్.. ఆఫ్‌ స్టంప్‌కు దూరంగా నెమ్మదిగా బంతిని వేశాడు. బంతిని సూర్యబండారా అందుకోలేకపోవడంతో.. వికెట్ల వెనుక సిద్ధంగా ఉన్న పంత్‌కు తగినంత సమయం దొరికింది. వెంటనే బంతితో బెయిల్స్‌ను పడగొట్టి శ్రీలంక బ్యాటర్‌ను పెవిలియన్‌కు పంపించాడు.


పంత్ ముందే పసిగట్టాడా?

ఈ వికెట్ వెనుక పంత్ వ్యూహం కీలకంగా కనిపించింది. అంతకుముందు బంతికే సూర్యబండారా ఎల్బీడబ్ల్యూ నుంచి త్రుటిలో తప్పించుకున్నాడు. ఆ సమయంలో పంత్ స్టంప్ మైక్‌లో సుతార్‌తో పాటు ఫీల్డర్లకు సూచనలు చేస్తూ కనిపించాడు. బ్యాటర్ కాస్త అసహనానికి గురవుతున్నాడని పసిగట్టిన పంత్.. మిడాన్‌లో ఉన్న ఫీల్డర్‌ను కూడా సిద్ధంగా ఉండాలని సూచించినట్లు తెలుస్తోంది. మరుసటి బంతికే సూర్యబండారా క్రీజు దాటి ముందుకు రావడంతో పంత్-సుతార్ ప్లాన్ పనిచేసింది.


ఇవి కూడా చదవండి:

కుర్రాళ్ల భవిష్యత్తుకే మంచిది కాదు.. ఐసీసీ, బీసీసీఐ చర్యలు తీసుకోవాలి: సంజయ్ మంజ్రేకర్

ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్: అగ్రస్థానంలో స్టార్క్.. రెండో స్థానానికి పడిపోయిన బుమ్రా

Updated Date - Aug 26 , 2026 | 05:00 PM