Share News

నేపాల్‌లో మెరుపు వరదలు.. బిహార్, ఉత్తర్‌ప్రదేశ్‌లో హై అలర్ట్..

ABN , Publish Date - Aug 26 , 2026 | 05:11 PM

నేపాల్‌లో భారీ వరదల నేపథ్యంలో బిహార్, ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. వరద నీరు రెండు రాష్ట్రాలకు వ్యాపించే అవకాశం ఉన్నందున నేపాల్ సరిహద్దు ప్రాంతాల్లో ముందస్తు చర్యలు చేపట్టాయి.

నేపాల్‌లో మెరుపు వరదలు.. బిహార్, ఉత్తర్‌ప్రదేశ్‌లో హై అలర్ట్..
Flood Alert

ఇంటర్‌నెట్ డెస్క్: నేపాల్‌లో మెరుపు వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వరదల కారణంగా ఇప్పటి వరకు 16 మంది ప్రాణాలు కోల్పోయారని, 400 మంది గల్లంతయ్యారని స్థానిక అధికారులు అంచనా వేస్తున్నారు. నేపాల్‌లో భారీ వరదల నేపథ్యంలో బిహార్, ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. వరద నీరు రెండు రాష్ట్రాలకు వ్యాపించే అవకాశం ఉన్నందున నేపాల్ సరిహద్దు ప్రాంతాల్లో ముందస్తు చర్యలు చేపట్టాయి. ఈ మేరకు బిహార్ ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి అధ్యక్షతన బుధవారం అత్యవసర సమావేశం జరిగింది.


జిల్లా అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఆదేశించారు. డ్యామ్‌లు, కరకట్టలపై 24 గంటల నిఘా పెట్టాలని, రాత్రివేళల్లోనూ పెట్రోలింగ్‌ నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల్లో లౌడ్‌స్పీకర్లతో హెచ్చరికలు జారీ చేయాలని, అత్యవసర పరిస్థితులకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి స్పష్టం చేశారు.


అధికారులకు యోగీ కీలక ఆదేశాలు..

నేపాల్ వరదల నేపథ్యంలో ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. . ఈ మేరకు తన ఎక్స్ ఖాతాలో ముఖ్యమంత్రి యోగీ బుధవారం ఓ పోస్టు పెట్టారు. ఆ పోస్టులో.. గండక్, నారాయణి నదులలో నీటి మట్టాలు పెరుగుతున్నాయని ఆయన తెలిపారు. ఈ ప్రభావంతో మహారాజ్‌గంజ్, కుషీనగర్ జిల్లాలలో వరదలు వచ్చే అవకాశం ఉందని అన్నారు. స్థానిక యంత్రాంగం పూర్తిగా అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశించినట్లు తెలిపారు.


ఇవి కూడా చదవండి

పంత్ మాస్టర్ ప్లాన్.. శ్రీలంక బ్యాటర్‌ను బోల్తా కొట్టించిన మానవ్ సుతార్!

పండ్లను ఫ్రిజ్‌లో పెడితే పోషకాలు తగ్గిపోతాయా?

Updated Date - Aug 26 , 2026 | 05:19 PM