నేపాల్‌లో ఆకస్మిక వరదలు.. 1000 మంది గల్లంతు..
ABN , Publish Date - Aug 26 , 2026 | 03:20 PM
నేపాల్‌లో భారీ వర్షాలు అలజడి సృష్టిస్తున్నాయి. ఆకస్మిక వరదలు ఊళ్లను ముంచెత్తుతున్నాయి. ఉద్ధృతంగా ప్రవహించిన భోటేకోశీ నది నువాకోట్, ధాడింగ్ జిల్లాల్లో బీభత్సం సృష్టించింది.
ఇంటర్‌నెట్ డెస్క్: నేపాల్‌లో భారీ వర్షాలు అలజడి సృష్టిస్తున్నాయి. ఆకస్మిక వరదలు ఊళ్లను ముంచెత్తుతున్నాయి. ఉద్ధృతంగా ప్రవహించిన భోటేకోశీ నది నువాకోట్, ధాడింగ్ జిల్లాల్లో బీభత్సం సృష్టించింది. టిబెట్ వైపు నుంచి వచ్చిన ఆకస్మిక వరదల కారణంగా పలు ఊళ్లు, బ్రిడ్జ్‌లు, ప్రాజెక్ట్‌లు నీటిలో కొట్టుకుపోయాయి. వరద బీభత్సం కారణంగా బుధవారం ఉదయం రసువా జిల్లాలో 1000 మంది నీటిలో కొట్టుకుపోయారని అధికారులు అంచనా వేస్తున్నారు. వరదలో కొట్టుకుపోయిన వారిలో 105 మంది భారతీయులు ఉన్నట్లు తెలుస్తోంది.
వరద ప్రభావిత ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన సహాయ చర్యలు మొదలయ్యాయి. అధికారులు 15 హెలికాప్టర్లను రంగంలోకి దించారు. సహాయక సిబ్బంది బుసి, తుసు ప్రాంతాల్లో 20 మందిని రక్షించారు. గాయపడ్డ వారిని మచిలి ట్రైనింగ్ క్యాంప్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. నదీ పరివాహక ప్రాంతాల్లో నివసించే వారు వెంటనే అక్కడినుంచి సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అధికారులు ఇప్పటి వరకు 8 మృతదేహాలను నీటినుంచి స్వాధీనం చేసుకున్నారు.
ఇవి కూడా చదవండి
యువకుడి ఆత్మహత్య.. ప్రియురాలు మోసం చేసిందంటూ సెల్ఫీ వీడియో
ఫైర్ ఇంజిన్‌తో ఎమ్మెల్యే కారును కడిగిన సిబ్బంది.. వీడియో వైరల్