యువకుడి ఆత్మహత్య.. ప్రియురాలు మోసం చేసిందంటూ సెల్ఫీ వీడియో
ABN , Publish Date - Aug 26 , 2026 | 03:14 PM
నెల్లూరు జిల్లాలో యువకుడి ఆత్మహత్య కలకలం రేపుతోంది. ప్రియురాలు మోసం చేసిందంటూ సెల్ఫీ వీడియో తీసుకుని సామాజిక మాధ్యమంలో పోస్టు చేశాడు. ఆపై ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.
నెల్లూరు, ఆగస్టు 26: జిల్లాలో యువకుడి ఆత్మహత్య కలకలం రేపుతోంది. ప్రియురాలు మోసం చేసిందంటూ బలవన్మరణానికి పాల్పడ్డాడు. ప్రియురాలి మోసం గురించి సెల్ఫీ వీడియోలో తెలిపి సామాజిక మాధ్యమంలో పోస్టు చేసి.. ఆపై ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. జిల్లాలోని వెంకటాచల మండలానికి చెందిన శివకుమార్(22), ఓ యువతి మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అయితే ఇటీవల సదరు యువతి.. శివకుమార్‌ను మోసం చేసి మరో వ్యక్తితో ప్రేమ వ్యవహారం నడిపడమే కాకుండా.. అతడితో వెళ్లిపోయింది. విషయం తెలిసిన శివ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు.
ప్రేమించిన యువతి మోసం చేసిందంటూ గత రాత్రి సెల్ఫీ వీడియో తీసుకుని ఆపై ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తనకు న్యాయం చేయాలని శివకుమార్ సెల్ఫీ వీడియోలో కోరాడు. కొడుకు మరణంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. యువకుడి బలవన్మరణానికి కారణమైన యువతిపై కేసు నమోదు చేయాలని కుటుంబసభ్యులు డిమాండ్ చేస్తున్నారు. నెల్లూరు జీజీహెచ్ వద్ద శివకుమార్ తల్లిదండ్రులు, బంధువులు, మిత్రులు ధర్నాకు దిగారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇవి కూడా చదవండి...
సనాతన ధర్మాన్ని నాశనం చేయాలని చూస్తే ఊరుకోం: భాను ప్రకాశ్ రెడ్డి
ప్రతి చేనేత కార్మికుడికీ ‘నేతన్నల సేవలో పథకం’: మంత్రి సవిత
Read Latest AP News And Telugu News