జగన్ హయాంలో ఏపీకి ఆర్థికంగా నష్టం: రామ్మోహన్ నాయుడు
ABN , Publish Date - Mar 21 , 2026 | 06:57 PM
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ హయాంలో ఏపీ ఆర్థికంగా చాలా నష్టపోయిందని ధ్వజమెత్తారు.
శ్రీకాకుళం, మార్చి 21(ఆంధ్రజ్యోతి): వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు (Kinjarapu Ram Mohan Naidu) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ హయాంలో ఏపీ ఆర్థికంగా చాలా నష్టపోయిందని ధ్వజమెత్తారు. వైసీపీ హయాంలో జరిగిన పొరపాట్లను తమ ప్రభుత్వంలో సరిచేస్తున్నామని చెప్పుకొచ్చారు. ఈరోజు(శనివారం) అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. రూ.4 కోట్లతో ఇంద్రపుష్కరిణి పున:నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి అచ్చెన్నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు మాట్లాడారు. అరసవల్లి ఆలయ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని తెలిపారు.
అరసవల్లి ఆలయంలో అభివృద్ధి పనులు..
అరసవల్లి ఆలయంలో రూ.4 కోట్లతో మాస్టర్ ప్లాన్‌లో భాగంగా అభివృద్ధి పనులు చేపట్టామని రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. రథసప్తమి వేడుకలు రాష్ట్ర పండుగగా నిర్వహించామని చెప్పుకొచ్చారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రసాదం స్కీమ్‌లో అరసవల్లి నిధులు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తామని తెలిపారు. రూ.4 కోట్లతో పుష్కరిణి అభివృద్ధికి చర్యలు చేపట్టామని అన్నారు. భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఆలయ అభివృద్ధికి చర్యలు చేపట్టామని వివరించారు. శ్రీకాకుళం కార్పొరేషన్‌ను అన్నివిధాలా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. కార్గిల్ పార్క్ అత్యున్నత ప్రమాణాలతో రూపుదిద్దుకుందని రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
అకాల వర్షాలతో పంట దెబ్బతిన్న రైతన్నలను ఆదుకుంటాం: సీఎం చంద్రబాబు
దేవుడి సాక్షిగా నేను రాసినవన్నీ నిజాలే.. వైఎస్ విజయలక్ష్మి షాకింగ్ కామెంట్స్
‘ఆస్కార్’ రేంజ్‌లో అవినాశ్ ప్రెస్‌మీట్.. బీటెక్ రవి సెటైర్లు
Read Latest AP News And Telangana News And International News And Telugu News