అకాల వర్షాలతో పంట దెబ్బతిన్న రైతన్నలను ఆదుకుంటాం: సీఎం చంద్రబాబు
ABN , Publish Date - Mar 20 , 2026 | 05:48 PM
అకాల వర్షాలతో పంట దెబ్బతిన్న రైతన్నలను ఆదుకుంటామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. రైతన్నలు అధైర్యపడొద్దని.. అండగా ఉంటామని భరోసా కల్పించారు.
అమరావతి, మార్చి 20 (ఆంధ్రజ్యోతి): అకాల వర్షాలతో పంట దెబ్బతిన్న రైతన్నలను ఆదుకుంటామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) వ్యాఖ్యానించారు. రైతన్నలు అధైర్యపడొద్దని.. అండగా ఉంటామని భరోసా కల్పించారు. అకాల వర్షాలతో పంట నష్టంపై సీఎం తన క్యాంప్ కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్లు, ఉన్నతాధికారులతో ఈరోజు(శుక్రవారం) వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు.
పంట నష్టంపై రెండో రోజూ సీఎం సమీక్ష..
అకాల వర్షాలతో సంభవించిన పంట నష్టంపై వరుసగా రెండో రోజూ సీఎం సమీక్షించారు. భారీ గాలులు, అకాల వర్షాలు, వడగళ్లతో దెబ్బతిన్న పంటల వివరాలను తెలుసుకున్నారు. 12 జిల్లాల్లోని 42 మండలాల్లో 4,840 హెక్టార్లలో మొక్కజొన్న, 1,534 హెక్టార్లలో వరి, 310 హెక్టార్లలో మినుము పంటలకు నష్టం వాటిళ్లిందని అధికారులు వివరించారు. వీటి విలువ రూ.40 కోట్లుగా అధికారులు తేల్చారు. 9 జిల్లాల్లో 48 మండలాల్లో 1,301 హెక్టార్లలో అరటి, బొప్పాయి, మిరప, కూరగాయలు, మామిడి, ఆరెంజ్, నిమ్మ పంటలు దెబ్బతినట్లు అధికారులు వెల్లడించారు. ఉద్యాన పంటల నష్టం విలువ రూ.22.68 కోట్లుగా అంచనా వేశారు.
ఎల్పీజీ సరఫరాపై సీఎం చంద్రబాబు సమీక్ష..
అలాగే, ఎల్పీజీ సరఫరాపై సీఎం చంద్రబాబు సమీక్షా సమావేశం నిర్వహించారు. భవిష్యత్తులో గ్యాస్ సిలిండర్ల సమస్య తలెత్తకుండా వ్యవస్థను తీర్చిదిద్దాలని సీఎం సూచించారు. ఇండక్షన్ స్టవ్‌లు, పీఎన్జీ, ఈవీ వంటి ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టాలని అన్నారు. ఇరాన్ – ఇజ్రాయల్ యుద్ధంతో గ్లోబల్ సప్లయ్ చైన్ దెబ్బతినక ముందే అప్రమత్తం కావాలని సూచించారు. ఫర్టిలైజర్లు, పెట్రోల్, డీజిల్ లోటు రాకుండా కేంద్రంతో సంప్రదింపులు జరపాలని ఆదేశించారు. గ్రామీణ, గిరిజన ప్రాంతాలు, విద్యాసంస్థలు, ఆలయాలకు ఎల్పీజీ సరఫరాలో ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.
సీఎం చంద్రబాబుకు సబ్కా ప్రతినిధుల ధన్యవాదాలు..
సీఎం చంద్రబాబుకు సబ్కా ప్రతినిధులు ధన్యవాదాలు తెలిపారు. ఉగాది కానుకగా తాము సైతం ఊహించని విధంగా సూక్ష్మ, చిన్న మధ్యతరగతి కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించారని హర్షం వ్యక్తం చేశారు. సుదీర్ఘంగా ఎదురు చూస్తున్న 2021 వివిధ మున్సిపాలిటీలలో పనులు చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు విడుదల చేయడంపై సబ్కా మనస్ఫూర్తిగా స్వాగతిస్తోందని అన్నారు. అలాగే రోడ్ల పనులు చేసిన వారికి, డీఎంఎఫ్, ఎస్డీఎంఎఫ్, వివిధ రాష్ట్రాల్లో పనులు చేసిన వారికి బిల్లులు విడుదల చేశారని తెలిపారు. ప్రభుత్వానికి ఉన్న ఆర్థిక సవాళ్లలో సైతం ఉగాది పండుగ సందర్భంగా నిధులు విడుదల చేసినందుకు ముఖ్యమంత్రికి, మంత్రులకు, అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. ఇంకా బిల్లులు రాని కాంట్రాక్టర్లకు సైతం ఈ ఆర్థిక సంవత్సరంలోనే నిధులు చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. ఉగాది కానుక ఇచ్చినందుకుగానూ థాంక్యూ సీఎం సార్ అంటూ సబ్కా ప్రతినిధులు ధన్యవాదాలు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పూర్తిస్థాయిలో పంట నష్టాన్ని లెక్కించాలి.. అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
యువత ఆకాంక్షలను నెరవేరుస్తున్నాం: పవన్ కల్యాణ్
నా ఛాంప్‌తో కలిసి ఉగాది వేడుకలు.. మంత్రి నారా లోకేశ్ ఆసక్తికర పోస్టు
Read Latest AP News And Telangana News And International News And Telugu News