యువత ఆకాంక్షలను నెరవేరుస్తున్నాం: పవన్ కల్యాణ్
ABN , Publish Date - Mar 19 , 2026 | 07:59 PM
ఉగాది పర్వదినాన రాష్ట్ర యువతకు తమ కూటమి ప్రభుత్వం తీయటి కబురు చెప్పిందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. 10,060 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీకి జాబ్ క్యాలెండర్ విడుదల చేశామని ప్రస్తావించారు.
అమరావతి, మార్చి 19 (ఆంధ్రజ్యోతి): ఉగాది పర్వదినాన రాష్ట్ర యువతకు తమ కూటమి ప్రభుత్వం తీయటి కబురు చెప్పిందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (PawanKalyan) వ్యాఖ్యానించారు. 10,060 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీకి జాబ్ క్యాలెండర్ విడుదల చేశామని ప్రస్తావించారు. ఈమేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ట్వీట్ పెట్టారు. నిర్దేశిత సమయంలో ఈ ఉద్యోగాలు భర్తీ చేస్తామని స్పష్టం చేశారు.
30,607 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశాం..
సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం యువత ఆకాంక్షలను నెరవేరుస్తోందని అన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 20 నెలల్లో 30,607 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశామని చెప్పుకొచ్చారు. ఉపాధ్యాయ, కానిస్టేబుల్ పోస్టులకు ఎంపికైన వారికి నియామక పత్రాలు అందించినప్పుడు యువత కళ్లలో ఆనందం చూశామని అన్నారు. ఈ ఏడాది ఇచ్చే నోటిఫికేషన్ల ద్వారా 10,060 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని స్పష్టం చేశారు. గ్రూప్ 1, గ్రూప్ 2, ఇంజనీరింగ్, టీచింగ్, యూనిఫాం సర్వీసెస్ పోస్టులను భర్తీ చేయనున్నామని తెలిపారు. ఇక ఉద్యోగార్థులు ప్రిపరేషన్‌లో నిమగ్నం కావాలని పవన్ కల్యాణ్ సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఐదు రకాల బస్సుల్లో దివ్యాంగులు ఉచితంగా ప్రయాణించొచ్చు: సీఎం
విశాఖ రైల్వేజోన్ కార్యకలాపాలు త్వరలో ప్రారంభం: అశ్వినీ వైష్ణవ్
జగన్ హయాంలో వివేకా హత్య కేసులో ఏ ఒక్క ఆధారమైనా ఎందుకు బయటపెట్టలేదు.. షర్మిల ధ్వజం
Read Latest AP News And Telangana News And International News And Telugu News