Share News

పూర్తిస్థాయిలో పంట నష్టాన్ని లెక్కించాలి.. అధికారులకు సీఎం కీలక ఆదేశాలు

ABN , Publish Date - Mar 19 , 2026 | 05:24 PM

ఏపీలో అకాల వర్షాలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు(గురువారం) సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో అధికారులకు పలు కీలక అంశాలపై సీఎం దిశానిర్దేశం చేశారు.

పూర్తిస్థాయిలో పంట నష్టాన్ని లెక్కించాలి.. అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
CM Chandra babu Naidu

అమరావతి, మార్చి 19 (ఆంధ్రజ్యోతి): ఏపీలో అకాల వర్షాలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandra babu Naidu) ఈరోజు(గురువారం) సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అధికారులకు పలు కీలక అంశాలపై సీఎం దిశానిర్దేశం చేశారు. పంట నష్టంపై అధికారులు ప్రాథమిక అంచనాలు వెల్లడించారు. అకాల వర్షాలతో 1,215 హెక్టార్లలో పంట నష్టం జరిగిందని తెలిపారు.


ఆరు జిల్లాల్లోని 16 మండలాలపై వర్షం అధిక ప్రభావం చూపుతోందని అధికారులు అన్నారు. మరో 267 హెక్టార్లలోని ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయన్నారు. పూర్తిస్థాయిలో పంటనష్టాన్ని వెంటనే లెక్కించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. వర్షాల నేపథ్యంలో అన్నదాతలు అధైర్యపడవద్దని, అండగా ఉంటామని సీఎం చంద్రబాబు భరోసా కల్పించారు.


జాబ్‌ ఫస్ట్‌ అనేది కూటమి ప్రభుత్వ విధానం..

అలాగే ఉపాధి కల్పనపై సీఎం చంద్రబాబు చర్చించారు. జాబ్‌ ఫస్ట్‌ అనేది కూటమి ప్రభుత్వ విధానమని చెప్పుకొచ్చారు. ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగాల్లో 6 లక్షలకు పైగా ఉద్యోగాలు కల్పించామని తెలిపారు. పెట్టుబడులు, పరిశ్రమల స్థాపనతో పెద్దఎత్తున ఉద్యోగాలు కల్పిస్తున్నామని స్పష్టం చేశారు. ప్రభుత్వ శాఖల్లో 10,060 ఉద్యోగాలను భర్తీ చేశామని వెల్లడించారు. మే 15వ తేదీ నుంచి అక్టోబర్‌ 15వ తేదీ వరకు ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేస్తామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఐదు రకాల బస్సుల్లో దివ్యాంగులు ఉచితంగా ప్రయాణించొచ్చు: సీఎం

విశాఖ రైల్వేజోన్ కార్యకలాపాలు త్వరలో ప్రారంభం: అశ్వినీ వైష్ణవ్

జగన్ హయాంలో వివేకా హత్య కేసులో ఏ ఒక్క ఆధారమైనా ఎందుకు బయటపెట్టలేదు.. షర్మిల ధ్వజం

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Mar 19 , 2026 | 05:28 PM