Share News

దేవుడి సాక్షిగా నేను రాసినవన్నీ నిజాలే.. వైఎస్ విజయలక్ష్మి షాకింగ్ కామెంట్స్

ABN , Publish Date - Mar 20 , 2026 | 03:24 PM

కుటుంబ ఆస్తులపై దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సతీమణి విజయలక్ష్మి కీలక వ్యాఖ్యలు చేశారు. 2009లో వైఎస్‌.రాజశేఖర రెడ్డి మరణం వరకున్న ఆస్తులన్నీ కుటుంబ ఆస్తులేనని స్పష్టం చేశారు.

దేవుడి సాక్షిగా నేను రాసినవన్నీ నిజాలే.. వైఎస్ విజయలక్ష్మి షాకింగ్ కామెంట్స్
YS Vijayalakshmi

అమరావతి, మార్చి 20 (ఆంధ్రజ్యోతి): కుటుంబ ఆస్తులపై దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి సతీమణి విజయలక్ష్మి(YS Vijayalakshmi) కీలక వ్యాఖ్యలు చేశారు. 2009లో వైఎస్ఆర్ మరణం వరకున్న ఆస్తులన్నీ కుటుంబ ఆస్తులేనని(Combined Family Assets) స్పష్టం చేశారు. ఆస్తుల పంపకం ఎప్పుడూ జరగలేదని ఆమె క్లారిటీ ఇచ్చారు. అన్ని ఆస్తులను నలుగురు మనుమళ్లకు సమానంగా పంచాలనేదే వైఎస్ఆర్ ఉద్దేశమని, ఇది ఆయన ఆదేశం కూడా అని స్పష్టం చేశారు.


తమ దగ్గరి వాళ్లందరికీ తెలిసిన వాస్తవమిదని విజయలక్ష్మి అన్నారు. ఎంఓయూలో వైఎస్.షర్మిలకు రాసిన ప్రతీ ఆస్తి న్యాయంగా ఆమెకు చెందాల్సినవేనని తెలిపారు. అందుకే వైసీపీ అధినేత, తన కుమారుడు జగన్‌మోహన్ రెడ్డి మళ్లీ ఎంఓయూ రాశారని ప్రస్తావించారు. నిజానికి తనకు తక్కువే రాశారని, సరస్వతి సిమెంట్‌తో సహా ఎంఓయూలో లేని యెలహంక ల్యాండ్ కూడా షర్మిలదేనని చెప్పుకొచ్చారు. జగన్ ఇచ్చానని చెబుతున్న నగదు షర్మిల వాటాకు ఇచ్చిన డెవిడెండ్ మాత్రమేనని స్పష్టం చేశారు. ఆస్తుల విషయంలో జగన్ తన మేనల్లుడికి, మేనకోడలికి ఇప్పటివరకు అన్యాయం చేశారని చెప్పుకొచ్చారు. ఎప్పటికైనా తనకు న్యాయం చేస్తారని జగన్ తల్లిగా ఆశిస్తున్నానని అన్నారు.


ఇప్పటివరకూ ఆస్తుల పంపకం ఎప్పుడూ జరగలేదని విజయలక్ష్మి క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు చదువుతున్న షర్మిల ఆస్తుల లాంటివి వైఎస్సార్ జగన్‌కు కూడా ఇచ్చారని తెలిపారు. అది ఆస్తి పంపకం కాదని అన్నారు. నిజమేమిటో దేవుడికి, తన కొడుక్కి మాత్రమే తెలుసని చెప్పుకొచ్చారు. తమ ఆస్తులపై గోబెల్స్ ప్రచారం ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. మీరు ఎంత కాదన్నా దేవుడే న్యాయం చేస్తారని తెలిపారు. తమ ఆస్తులపై అసత్యాల ప్రచారం మానుకోవాలని వైఎస్ఆర్ భార్యగా చేతులు జోడించి అడుగుతున్నానని అన్నారు. మళ్లీ మళ్లీ మీడియాలో ప్రస్తావించొద్దని వేడుకుంటున్నానని వైఎస్ విజయలక్ష్మి చెప్పారు.


VIJAYA-LAXMI.jpg


ఈ వార్తలు కూడా చదవండి..

పూర్తిస్థాయిలో పంట నష్టాన్ని లెక్కించాలి.. అధికారులకు సీఎం కీలక ఆదేశాలు

యువత ఆకాంక్షలను నెరవేరుస్తున్నాం: పవన్ కల్యాణ్

నా ఛాంప్‌తో కలిసి ఉగాది వేడుకలు.. మంత్రి నారా లోకేశ్ ఆసక్తికర పోస్టు

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Mar 20 , 2026 | 03:52 PM