‘ఆస్కార్’ రేంజ్‌లో అవినాశ్ ప్రెస్‌మీట్.. బీటెక్ రవి సెటైర్లు
ABN , Publish Date - Mar 20 , 2026 | 04:05 PM
కడప ఎంపీ అవినాశ్‌రెడ్డిపై పులివెందుల తెలుగుదేశం ఇన్‌చార్జ్ బీటెక్ రవి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినాశ్‌రెడ్డి ప్రెస్‌మీట్ చూస్తే ఆస్కార్ అవార్డు ఇచ్చే రేంజ్‌లో ఉందని ఎద్దేవా చేశారు.
కడప, మార్చి 20 (ఆంధ్రజ్యోతి): కడప ఎంపీ అవినాశ్‌రెడ్డిపై (Avinash Reddy) పులివెందుల తెలుగుదేశం ఇన్‌చార్జ్ బీటెక్ రవి (BTech Ravi) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినాశ్‌రెడ్డి ప్రెస్‌మీట్ చూస్తే ఆస్కార్ అవార్డు ఇచ్చే రేంజ్‌లో ఉందని ఎద్దేవా చేశారు. ఈరోజు(శుక్రవారం) కడప జిల్లాలోని టీడీపీ కార్యాలయంలో బీటెక్ రవి మీడియాతో మాట్లాడారు. మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు గురించి అవినాశ్‌రెడ్డి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. వివేకా కుమార్తె సునీత సీఎం చంద్రబాబుకు సహకరిస్తున్నారని అవినాశ్‌రెడ్డి చెప్పడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు.
విడ్డూరంగా అవినాశ్ మాటలు..
సునీతకు రాజకీయాలపై ఆసక్తి ఉంటే అవినాశ్‌రెడ్డి కడప ఎంపీ కాలేరని.. ఆ స్థానంలో సునీత ఎంపీ అయ్యేవారని బీటెక్ రవి చెప్పుకొచ్చారు. వివేకా హత్య కేసు గురించి అవినాశ్ చెబుతున్న మాటలు విడ్డూరంగా ఉన్నాయని సెటైర్లు గుప్పించారు. ‘స్పాట్ పెట్టింది మీరు.. స్పాట్‌కు పోయింది మీరు.. స్పాట్లో దగ్గరుండి సాక్ష్యాధారాలను క్లీన్ చేయిచ్చిందే అవినాశ్‌రెడ్డి’ అని ఆరోపించారు. వివేకా కేసులో అవినాశ్‌రెడ్డి శిక్ష నుంచి తప్పించుకోలేరని బీటెక్ రవి పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పూర్తిస్థాయిలో పంట నష్టాన్ని లెక్కించాలి.. అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
యువత ఆకాంక్షలను నెరవేరుస్తున్నాం: పవన్ కల్యాణ్
నా ఛాంప్‌తో కలిసి ఉగాది వేడుకలు.. మంత్రి నారా లోకేశ్ ఆసక్తికర పోస్టు
Read Latest AP News And Telangana News And International News And Telugu News