కీలక భేటీకి ఎన్డీఏ సిద్ధం.. మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రధాన చర్చ
ABN , Publish Date - Apr 14 , 2026 | 05:04 PM
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఉండవల్లిలోని నివాసంలో ఎన్డీఏ కూటమి పార్టీల అత్యున్నత స్థాయి సమావేశం బుధవారం సాయంత్రం జరగనుంది.
అమరావతి, ఏప్రిల్ 14 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandra babu Naidu).. ఉండవల్లిలోని నివాసంలో ఎన్డీఏ కూటమి పార్టీల అత్యున్నత స్థాయి సమావేశం (NDA Leaders Meet) రేపు(బుధవారం) సాయంత్రం జరగనుంది. ఈ భేటీలో రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలతో పాటు జాతీయ స్థాయి ప్రాధాన్యం ఉన్న విషయాలపై కూడా చర్చించనున్నారు.
ప్రధాన అతిథులు వీరే..
ఈ సమావేశానికి ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, కూటమిలోని ఇతర ముఖ్య నాయకులు హాజరుకానున్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం, తదుపరి కార్యాచరణ , రాష్ట్ర అభివృద్ధి ప్రణాళికలపై మాట్లాడనున్నారు.
చర్చకు రానున్న ప్రధాన అంశాలు
ఈ సమావేశం కేవలం సాధారణ భేటీ మాత్రమే కాకుండా, భవిష్యత్తు రాజకీయ దిశానిర్దేశం చేసేలా ఉండబోతోంది.
మహిళా రిజర్వేషన్ బిల్లు.. అమలు
మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందిన నేపథ్యంలో దీనిపై ప్రజల్లోకి వెళ్లాల్సిన విధానంపై నేతలు చర్చించనున్నారు. మహిళా సాధికారత దిశగా కూటమి ప్రభుత్వం తీసుకోబోయే వినూత్న కార్యక్రమాలపై ఓ స్పష్టమైన రూట్ మ్యాప్‌ను సిద్ధం చేయనున్నారు.
కూటమి సమన్వయం
టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల మధ్య క్షేత్రస్థాయిలో సమన్వయాన్ని మరింత బలోపేతం చేయడంపై దృష్టి సారించనున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంపై నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. ఉండవల్లిలోని నివాసంలో చర్చల అనంతరం, కూటమి అగ్రనేతలు అందరూ కలిసి మీడియా సమావేశం నిర్వహించే అవకాశం ఉంది. ఈ సమావేశంలో కూటమి తీసుకున్న కీలక నిర్ణయాలను అధికారికంగా ప్రకటించనున్నారు.
ఈ భేటీ ప్రాధాన్యమిదే..
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, మహిళా రిజర్వేషన్ వంటి చారిత్రాత్మక అంశాలపై చర్చించేందుకు మూడు పార్టీల అగ్రనేతలు ఒకే చోట చేరడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ మధ్య జరిగే ఈ భేటీ భవిష్యత్తు రాజకీయ వ్యూహాలకు వేదిక కానుంది. రేపు సాయంత్రం జరిగే ఈ ఎన్డీయే భేటీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత కీలకం కానుంది. మహిళా రిజర్వేషన్ బిల్లు అమలుపై కూటమి ప్రభుత్వం ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకుంటుందోనని ఉత్కంఠగా మారింది.
ఈ వార్తలు కూడా చదవండి...
డీ-రెగ్యులేషన్ ఫేజ్-3పై ముందస్తు చర్చలు.. సీఎం చంద్రబాబు కీలక సూచనలు
జగన్‌వి.. శవ రాజకీయాలు.. మంత్రి అచ్చెన్నాయుడు సెటైర్లు
వివేకా కేసులో కొత్త మలుపు.. తదుపరి దర్యాప్తు కోరుతూ హైకోర్టులో సునీతారెడ్డి పిటిషన్
Read Latest AP News And Telangana News And International News And Telugu News