Minister Sridhar Babu: బీజేపీ, బీఆర్ఎస్ మధ్య రహస్య ఒప్పందాలు.. మంత్రి శ్రీధర్ బాబు హాట్ కామెంట్స్
ABN , Publish Date - Aug 11 , 2025 | 01:52 PM
రాజ్యాంగ వ్యవస్థలపై తమకు నమ్మకం ఉందని మంత్రి శ్రీధర్ బాబు ఉద్ఘాటించారు. 42శాతం బీసీ రిజర్వేషన్ల అంశం రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉందని చెప్పుకొచ్చారు. జంతర్ మంతర్ వద్ద తమ నిరసన ధర్నాకు బీజేపీ ఎంపీలు ఎందుకు మద్దతు పలకలేదని మంత్రి శ్రీధర్ బాబు ప్రశ్నించారు.
కరీంనగర్ జిల్లా ఆగస్టు11, (ఆంధ్రజ్యోతి): మేడిగడ్డ ప్రాజెక్ట్ లాంటి సంఘటనలు జరుగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని మంత్రి శ్రీధర్ బాబు (Minister Sridhar Babu) వ్యాఖ్యానించారు. ఫోన్ ట్యాపింగ్ విచారణలో రాజకీయ జోక్యం లేదని క్లారిటీ ఇచ్చారు. ఫోన్ ట్యాపింగ్‌పై అధికారులే విచారణ చేస్తున్నారని తెలిపారు. బీజేపీ, బీఆర్ఎస్‌తో లోపాయికారిగా ఒప్పందం చేసుకుందని విమర్శించారు. తమ మేనిఫేస్టోలోనే కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై జ్యూడీషనల్ ఎంక్వైరీ వేస్తామని చెప్పామని.. అన్నట్లుగానే వేశామని గుర్తుచేశారు. ఇవాళ(సోమవారం) మంత్రి శ్రీధర్ బాబు కరీంనగర్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మీడియాతో మాట్లాడారు.
రాజ్యాంగ వ్యవస్థలపై తమకు నమ్మకం ఉందని ఉద్ఘాటించారు. 42శాతం బీసీ రిజర్వేషన్ల అంశం రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉందని చెప్పుకొచ్చారు. జంతర్ మంతర్ వద్ద తమ నిరసన ధర్నాకు బీజేపీ ఎంపీలు ఎందుకు మద్దతు పలకలేదని ప్రశ్నించారు. బీసీల గురించి బీఆర్ఎస్ నేతలు మాట్లాడితే జనం నమ్ముతారా అని నిలదీశారు. ఫోన్ ట్యాపింగ్‌పై విచారణకు ఎవరినీ పిలవాలన్నది సిట్ అధికారులే నిర్ణయిస్తారని వెల్లడించారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై నిర్ణయం అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌దేనని మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
రేవంత్‌పై దాఖలైన అట్రాసిటీ కేసులో పిటీషనర్‌కు సుప్రీం చురకలు
హైదరాబాద్‌లో ఘరానా మోసం.. దొంగ స్వామీజీ బురిడీ
Read Latest Telangana News And Telugu News