Share News

Revanth Reddy case:రేవంత్‌పై దాఖలైన అట్రాసిటీ కేసులో పిటీషనర్‌కు సుప్రీం చురకలు

ABN , Publish Date - Aug 11 , 2025 | 12:22 PM

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు దాఖలు చేసిన పిటీషనర్ పెద్దిరాజుపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. హైకోర్టు న్యాయమూర్తి మౌసమి భట్టాచార్యకు అఫిడవిట్ రూపంలో క్షమాపణలు చెప్పాలని సీజేఐ బీఆర్ గవాయ్ ధర్మాసనం పిటీషనర్ పెద్దిరాజును హెచ్చరించింది.

 Revanth Reddy case:రేవంత్‌పై దాఖలైన అట్రాసిటీ కేసులో పిటీషనర్‌కు సుప్రీం చురకలు
Revanth Reddy Case

హైదరాబాద్, ఆగస్టు11(ఆంధ్రజ్యోతి): తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై (CM Revanth Reddy Case) ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు దాఖలు చేసిన పిటీషనర్ పెద్దిరాజుపై సుప్రీంకోర్టు (Supreme Court) సీరియస్ అయింది. హైకోర్టు న్యాయమూర్తి మౌసమి భట్టాచార్యకు అఫిడవిట్ రూపంలో క్షమాపణలు చెప్పాలని సీజేఐ బీఆర్ గవాయ్ ధర్మాసనం పిటీషనర్ పెద్దిరాజును హెచ్చరించింది.


రేవంత్‌రెడ్డిపై పెద్దిరాజు దాఖలు చేసిన కేసును గతంలో కొట్టేసింది తెలంగాణ హైకోర్టు. ఆ కేసును నాగ్‌పూర్ బెంచ్‌కి బదిలీ చేయాలని సుప్రీంలో ట్రాన్స్‌ఫర్ పిటీషన్ దాఖలు చేశారు పెద్దిరాజు. హైకోర్టు న్యాయమూర్తిపైనా అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు పిటీషనర్ పెద్ది రాజు. పిటీషన్ డ్రాప్ట్ చేసిన ఏఓఆర్, పెద్దిరాజులపై ఆగ్రహం వ్యక్తం చేసింది సుప్రీం ధర్మాసనం. హైకోర్టు న్యాయమూర్తి మౌసమి భట్టాచార్యకు వెంటనే క్షమాపణలు చెప్పాలని సీజేఐ బీఆర్ గవాయ్ ధర్మాసనం తెలిపింది. తదుపరి విచారణ నాలుగు వారాలకు సుప్రీం ధర్మాసనం వాయిదా వేసింది.


ఈ వార్తలు కూడా చదవండి

బెట్టింగ్ యాప్ కేసులో ఈడీ విచారణకు హాజరైన రానా దగ్గుబాటి

హైదరాబాద్‌కు భారీ వర్ష సూచన.. ఐటీ ఉద్యోగులకు వర్క్‌ఫ్రమ్ హోం..

Read Latest Telangana News And Telugu News

Updated Date - Aug 11 , 2025 | 12:52 PM