Fake Swamiji Fraud: హైదరాబాద్‌లో ఘరానా మోసం.. దొంగ స్వామీజీ బురిడీ
ABN , Publish Date - Aug 11 , 2025 | 11:13 AM
హిమాలయాల్లో దొరికే మూలికల భస్మంతో బంగారం తయారు చేస్తామని దొంగ స్వామిజీలు బంజారాహిల్స్‌లోని ఓ బాధితుడిని మోసం చేశారు. నాగపూర్ నుంచి వచ్చి నగరంలో దొంగ స్వామిజీలు మోసాలు చేస్తున్నారు. కష్టాలు తొలగిపోయేలా 2 కేజీల బంగారం తయారు చేసి ఇస్తామంటూ బాధితుడిని బురిడీ కొట్టించారు.
హైదరాబాద్, ఆగస్టు11(ఆంధ్రజ్యోతి): హిమాలయాల్లో దొరికే మూలికల భస్మంతో బంగారం తయారు చేస్తామని దొంగ స్వామిజీలు (Fake Swamiji Fraud) బంజారాహిల్స్‌లోని (Banjara Hills) ఓ బాధితుడిని మోసం చేశారు. నాగపూర్ నుంచి వచ్చి నగరంలో దొంగ స్వామిజీలు మోసాలు చేస్తున్నారు. కష్టాలు తొలగిపోయేలా రెండు కేజీల బంగారం తయారు చేసి ఇస్తామంటూ బాధితుడిని దొంగ స్వామిజీలు బురిడీ కొట్టించారు. బంజారా హిల్స్‌కి చెందిన గోపాల్‌సింగ్ అనే వ్యక్తికి దొంగ స్వామిజీలు టోకరా వేశారు.
రూ. 10 లక్షలు తీసుకుని వనమూలికా భస్మం తయారు చేసి ఇస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నెలరోజుల పాటు పూజలు చేసి ఎరుపురంగు బట్టలో రెండు కేజీల బంగారం అంటూ దొంగ స్వామీజీలు బాధితుడికి ఇచ్చి మోసానికి పాల్పడ్డారు. వారం రోజులు ఇంట్లో పూజలో ఉంచిన తర్వాత ఎరుపురంగు బట్టలో ఉన్న తర్వాత తెరవాలని స్వామీజీలు సూచించారు. అనుమానంతో ఐదురోజుల తర్వాత తెరిచి చూడగా బంగారం రంగుతో ఇనుప ముక్కలు కనిపించాయి. మోసపోయానని గ్రహించిన బాధితుడు లబోదిబో మంటూ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడు ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. ఈ కేసులో ఇప్పటికే ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుల కోసం బంజారాహిల్స్ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
ఈ వార్తలు కూడా చదవండి
బెట్టింగ్ యాప్ కేసులో ఈడీ విచారణకు హాజరైన రానా దగ్గుబాటి
హైదరాబాద్‌కు భారీ వర్ష సూచన.. ఐటీ ఉద్యోగులకు వర్క్‌ఫ్రమ్ హోం..
Read Latest Telangana News And Telugu News