Heavy Rain Alert: హైదరాబాద్‌కు భారీ వర్ష సూచన.. ఐటీ ఉద్యోగులకు వర్క్‌ఫ్రమ్ హోం..
ABN , Publish Date - Aug 11 , 2025 | 10:25 AM
Heavy Rain Alert: ఆగస్టు 13వ తేదీ నాటికి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే 13వ తేదీ నుంచి నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
హైదరాబాద్ మహా నగరంలో గత వారం రోజుల నుంచి వర్షాలు దంచికొడుతున్నాయి. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాత్రి వేళ బీభత్సం సృష్టిస్తున్నాయి. పలు చోట్ల 12 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదు అవుతోంది. రానున్న రోజుల్లో కూడా ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఆగస్టు 13వ తేదీ నాటికి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే 13వ తేదీ నుంచి నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
తెలంగాణ అంతటా అతి భారీ వర్షాలు
ఈ రోజు, రేపు తెలంగాణ అంతటా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ములుగు, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, రాజన్న సిరిసిల్ల, జనగామ, వికారాబాద్, మెదక్, సంగారెడ్డి, కామారెడ్డి యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురవనున్నాయని తెలిపింది. ఆగస్టు 13 నుంచి 16వ తేదీ వరకు జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, ఆదిలాబాద్, కుమురం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి,
ములుగు, మహబూబాబాద్, నల్గొండ, యాదాద్రి భువనగిరి, మేడ్చల్, రంగారెడ్డి, మెదక్, వికారాబాద్, హైదరాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఆయా జిల్లాకు రెడ్, ఆరెంజ్ అలెర్ట్‌లు జారీ చేసింది. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వం అలర్ట్ అయింది. పనివేళల్లో మార్పులు చేసుకోవాలని ప్రజలకు ప్రభుత్వం సూచించింది. తెలంగాణ అంతటా అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉండటంతో.. వర్క్ ఫ్రం హోమ్‌కు అనుమతి ఇవ్వాలని ఐటి కంపెనీలను ప్రభుత్వం ఆదేశించింది.
ఇవి కూడా చదవండి
ఇండియా కూటమితో భేటీకి ఈసీ అంగీకారం..
శివ భక్తుడికి షాక్.. పనీర్ కర్రీలో చికెన్ ముక్క..